న్యూఇయర్ వేళ మందుబాబులకు గుడ్ న్యూస్

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-23 15:10:54  IST  )

న్యూఇయర్ వేళ మందుబాబులకు గుడ్ న్యూస్

న్యూఇయర్ వేళ మందుబాబులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూఇయర్ వేడుకలకు ప్లాన్ చేసుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్స్ షాపు(Wine Shops)లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. రాత్రి ఒంటిగంటల వరకు బార్స్ నడిపేందుకు అనుమతులు ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. న్యూఇయర్ ఈవెంట్‌లకు కూడా రాత్రి ఒంటి గంట వరకు అవకాశం ఇచ్చారు. అయితే.. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఎక్సైజ్, నార్కోటిక్స్, పోలీసుల ఆధ్వర్యంలో అనుమానిత ప్రాంతాలు, పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్స్‌లో తనిఖీలు నిర్వహిస్తామన్నారు హైదరాబాద్‌ పోలీసులు. డ్రగ్స్ టెస్టులు కూడా నిమిషాల్లో తెలిసిపోయేలా అత్యాధునిక పరికరాలు వినియోగిస్తున్నామని చెప్పారు. పబ్బుల్లో డ్రగ్స్ ఛాయలు, అనుమానితుల గుర్తింపు కోసం ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీ చేస్తామని తెలిపారు. డ్రంకన్ అండ్‌ డ్రైవ్ తనిఖీల నేపథ్యంలో మద్యం సేవించి వాహనాలు నడపకుండా డ్రైవర్‌లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మొత్తంగా.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ పోలీసులు ప్రత్యేక చర్యలను చేపట్టారు. ప్రశాంత వాతావరణంలో న్యూఇయర్‌ వేడుకలను నిర్వహించుకోవాలని కోరుతున్నారు. నిబంధనలు అతిక్రమించితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Next Story