TG News : 2024 DSc ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

ఉపాధ్యాయులకు(Teachers) తెలంగాణ సర్కార్(Telangaan Govt) భారీ గుడ్ న్యూస్ తెలిపింది.

TG News : 2024 DSc ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : ఉపాధ్యాయులకు(Teachers) తెలంగాణ సర్కార్(Telangaan Govt) భారీ గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ 2024 DSC ఉపాధ్యాయులకు 2024 అక్టోబర్ 10 నుంచి వారి సర్వీస్‌ను లెక్కించి వేతనం చెల్లించాలన్న వారి డిమాండ్‌కు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ట్రెజరీ అధికారులకు ఆ తేదీ నుంచి వేతన బిల్లులను అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం DSC ద్వారా ఎంపికైన 11,062 మంది ఉపాధ్యాయులకు (సెకండరీ గ్రేడ్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్) వర్తించనుంది. ఇది వారి సర్వీసు గుర్తింపులో స్పష్టతను తీసుకురానుంది. కాగా ప్రభుత్వ నిర్ణయంపై కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story