- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడ్ న్యూస్.. సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్‌లో మరో 4 కోచ్‌లు
దేశవ్యాప్తంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రజల్లో అపూర్వ స్పందన లభిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా వందేభారత్ (Vandhebharath) ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రజల్లో అపూర్వ స్పందన లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ హైస్పీడ్ ట్రైన్లు వేగవంతమైన ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. సుమారు అన్ని రూట్లలోనూ ఈ రైళ్లకు టికెట్లు క్షణాల్లోనే బుక్ అవుతున్నాయి. ఈ వేగవంతమైన ట్రావెల్‌కు భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో, రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యాలను మరింత మెరుగుపరచే దిశగా అడుగులు వేస్తోంది.
ఈ నేపథ్యంలో సికింద్రాబాద్–విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20707/20708) రైళ్లలో కోచ్‌ల సంఖ్యను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం తెలిపింది. ఇప్పటి వరకు 14 ఏసీ చెయిర్ కార్ కోచ్‌లు ఉన్న ఈ రైళ్లకు నాలుగు అదనంగా కలిపి వాటిని 18కి చేర్చారు. అయితే రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌ల సంఖ్యలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇక ఈ మార్పులు శనివారం (జూలై 6) నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ఉదయం 5.05కు బయల్దేరి మధ్యాహ్నం 1.50కు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి మధ్యాహ్నం 2.30కి బయలుదేరి రాత్రి 11.00కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఇక మరికొన్ని రైళ్లలో కూడా కోచ్‌ల సంఖ్య పెంచుతూ రైల్వేశాఖ మరో కీలక ప్రకటన చేసింది. ముంబై-బళ్లార్ష్ (11001/11002), ముంబై-చెన్నై సెంట్రల్ (22157/22158), మైసూరు-రేణిగుంట (22135/22136), కొల్లాపుర్-నాగ్‌పుర్ (11403/11404) రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను నాలుగుకి పెంచారు. ఈ మార్పులు సెప్టెంబరు 5వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.






