ఇండియా కూటమికి డీఎంకే గుడ్ బై.. అధికారికంగా స్పీకర్‍కు లేఖ

by Prasad Jukanti |   (  Updated:2026-05-08 10:15:44  IST  )

తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ పొత్తు అధికారికంగా ముగిసింది. లోక్‌సభలో విడిగా సీట్లు కోరుతూ కనిమొళి లేఖ రాయగా, క్షేత్రస్థాయిలో దాడులు మొదలయ్యాయి.

ఇండియా కూటమికి డీఎంకే గుడ్ బై.. అధికారికంగా స్పీకర్‍కు లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మారిన రాజకీయ సమీకరణాలు ప్రతిపక్ష ఇండియా కూటమిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమిళనాడులో టీవీకేకు మద్దతు తెలపడంపై కాంగ్రెస్ పై గుర్రుగా ఉన్న డీఎంకే షాకింగ్ నిర్ణయం తీసుకుంది. డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య దశాబ్దాల కాలం నాటి పొత్తుకు అధికారికంగా ముగింపు పలికింది. ఈ నేపథ్యంలో లోక్‌సభలో తమ పార్టీ ఎంపీలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, కాంగ్రెస్‌తో తమ పొత్తు ముగిసిందని అందువల్ల ఇప్పటి వరకు పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కూర్చుంటున్న డీఎంకే సభ్యులు ఇకపై వారి పక్కన కూర్చోవడం సముచితం కాదని లేఖలో పేర్కొన్నారు. డీఎంకే పార్లమెంటరీ పార్టీ సభ్యులకు విడిగా సీట్లు కేటాయించాలని, తద్వారా సభలో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలు కల్పించాలని ఆమె స్పీకర్‌ను కోరారు.

భౌతిక దాడులు:

కాంగ్రస్, డీఎంకే మధ్య బంధం ముగిసిపోవడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. మయిలడుతురై లో కాంగ్రెస్ మద్దతుదారులపై డీఎంకే మద్దతుదారులు భౌతిక దాడులకు పాల్పడ్డారు. నిన్నా మొన్నటి వరకు స్నేహగీతం ఆలపించిన ఇరు పార్టీల నేతలు ఒక్కసారిగా ఇలా భౌదితక దాడులకు దిగడంతో అక్కడ సిట్యుయేషన్ సీరియస్ గా మారింది.




Next Story