- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today Gold, Silver Rates: సంక్రాంతి పండగ వేళ భారీ షాక్.. ఆల్ టైమ్ హైకి చేరిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయి.

దిశ,డైనమిక్ బ్యూరో: సంక్రాంతి పండగ వేళ పసిడి ధరలు బంగారం ప్రియులకు షాకిచ్చింది. పట్టపగ్గాలు లేకుండా పరుగులు తీస్తున్న పసిడి ధర (Gold Price) తాజాగా ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది. భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలతో బంగారం, వెండి ధరలకు మళ్లీ లెక్కలొచ్చాయి. తాజాగా ఇవాళ బంగారం, వెండి ధరలు చరిత్రలో ఎన్నడూ లేని ఆల్ టైమ్ రికార్డును (All Time High) నమోదు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,090 పెరిగి రూ.1,43,620 కి చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,000 పెరిగి రూ. రూ.1,31,650 చేరుకుంది.
బంగారం బాటలోనే వెండి:
బంగారంతో పాటు వెండి ధరలు (Silver Price) కూడా దూసుకుపోతున్నాయి. కిలో వెండి ధర ఒక్కరోజే రూ. 15,000 పెరిగి ఆల్ టైమ్ రికార్డు (All Time High) ధర రూ.3,07,000 కు చేరింది. జనవరి 1న కిలో వెండి ధర రూ.2,56,000 పలుకగా కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఏకంగా రూ.51,000 పెరిగి రూ.3,07,000 చేరింది. ఎన్నడూ లేని రీతిలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ బంగారం, వెండి ఒకదానికి మించి మరొకటి దూసుకుపోతుండటంతో వినియోగదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.
Read More : Silver: కొత్త రికార్డు గరిష్ఠాలకు వెండి, బంగారం ధరలు
Today Gold, Silver Rates: మహిళలకు బిగ్ షాకింగ్ న్యూస్.. నేడు అత్యంత భారీగా పెరిగిన ధరలు..






