- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold Rates: భారీగా తగ్గిన బంగారం ధర.. కొనుగోలుకు మంచి సమయం ఇదే!
బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఐదు రోజుల వ్యవధిలో బంగారం ధర రూ. 5 వేలు తగ్గింది.

దిశ, డైనమిక్ బ్యూరో: బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఐదు రోజుల వ్యవధిలో బంగారం ధర రూ. 5 వేలు తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1740 మేర ధర తగ్గి.. రూ. 1,23,660గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మీద రూ.1600 తగ్గి రూ.1,13,350గా ఉంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్లు బంగారం ధర రూ.1,310 తగ్గి రూ.92,740 గా నమోదైంది. మరోవైపు వెండి కిలోపై రూ.5 వేల వరకు ధర తగ్గింది. దీంతో కిలో రేటు రూ.1,73,000 వరకు దిగివచ్చింది.
కాగా, ప్రపంచవ్యాప్తంగా పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు తెలిసింది. గత రెండు నెలలుగా వరుసగా రికార్డులు సృష్టించిన పసిడి, ఈ నెలలు ఊహించని విధంగా భారీగా పడిపోయింది. ప్రపంచ మార్కెట్‌లలో విలువైన లోహాలపై డిమాండ్ తగ్గడం, అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ముగియడం, త్వరలోనే వడ్డీ రేట్లు తగ్గే అవకాశం లేదని ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు ఇవ్వడం.. ఈ మూడు అంశాలు కలిసి బంగారం తగ్గుదలకు కారణమయ్యాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. నేడు, మంగళవారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల గ్రాము Gold ధర రూ.174 తగ్గి రూ.12,366 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.160 తగ్గి 11,335 వద్దకు చేరింది. భారీగా ధర తగ్గడంతో కొనుగోలుకు మంచి సమయం ఇదే అని నిపుణులు చెబుతున్నారు.






