- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘనంగా గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి నాల్గవ పూజ..
చారిత్రాత్మకమైన గోల్కొండ కోట శ్రీ జగదాంబికా మహంకాళి (ఎల్లమ్మ తల్లి) కి అంగరంగ వైభవంగా నాల్గవ పూజ నిర్వహించారు.

దిశ, కార్వాన్ : చారిత్రాత్మకమైన గోల్కొండ కోట శ్రీ జగదాంబికా మహంకాళి (ఎల్లమ్మ తల్లి) కి అంగరంగ వైభవంగా నాల్గవ పూజ నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. బోనాలు సమర్పించేందుకు మహిళ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి తమ మొక్కులను చెల్లించుకుని అమ్మవారు ఆశీర్వాదం తీసుకున్నారు.
డప్పు చప్పుళ్ళతో.. పోతురాజుల విన్యాసాలతో.. శివసత్తుల పూనకంతో.. యువత కేరింతతో.. గోల్కొండ ప్రాంతమంతా శ్రీ జగదాంబికా మహంకాళి (ఎల్లమ్మ తల్లి) కి జై అంటూ మారు మ్రోగింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆదివారం సాయంత్రం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామ చంద్ర రావు లంగర్ హౌస్ లోని వేదిక సభ వద్ద అమ్మవారికి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాల జాతర తెలంగాణ రాష్ట్రంలో గోల్కొండ కోట లో ప్రారంభమై నెల రోజులపాటు అమ్మవారికి తొమ్మిది పూజలు అందుకుంటుంది అన్నారు. ఈ జాతరలో చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా పాల్గొని ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షులు ఉమా మహేందర్, ఇంద్రసేనారెడ్డి, పూర్ణచంద్రరావు, గోల్కొండ, లంగర్ హౌస్ డివిజన్ అధ్యక్షులు గంపల సతీష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






