- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో అక్రమాలు.. పదేళ్లుగా రూ.150 కోట్ల గోల్ మాల్
తెలంగాణలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు ఇంటలిజెన్స్ విభాగం దర్యాప్తు కూడా మొదలుపెట్టినట్టు సమాచారం. కాగా రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో, మున్సిపాలిటీల్లో ఎంతమంది, ఎంతకాలంగా పనిచేస్తున్నారు అనే వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. అయితే ఇటీవల ప్రభుత్వం రాష్ట్రంలో అసలు ఎంతమంది రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని ఆరా తీయగా.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విభాగాలలో 1.03 లక్షల మంది ఉద్యోగుల పూర్తి సమాచారం లేదు.
వీరు విధులకు హాజరైనట్టు చూపిస్తున్నా.. నివాసప్రాంతం వివరాలు గాని, ఫోన్ నంబర్లు, ఆధార్ వంటి ధ్రువపత్రాల వివరాలు కూడా ఏమీ లేకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వీరి పేరు మీద గత పదేళ్లుగా రూ.150 కోట్ల జీతాలు విడుదలయ్యాయి. ఈ వ్యవహారంలో జరిగిన గోల్ మాల్ బయటకు తీసెందుకు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విభాగాన్ని విచారణకు ఆదేశించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన భారీ స్కామ్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.






