- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాసరలో గోదావరి ఉగ్రరూపం..నీట మునిగిన కాటేజి, లాడ్జిలు
by Ajay Maddhiboyina |
మూడు రోజులుగా కురిసిన వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర ఆలయం వద్ద గోదావరి పొంగిపొర్లుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా జిల్లాలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుతోంది. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర ఆలయం వద్ద గోదావరి పొంగిపొర్లుతోంది. ఆలయ పురవీధులను సైతం వరద నీరు తాకింది.
దీంతో కాటేజ్‌లు, లాడ్జిలు నీటిలో మునిగిపోయాయి. భక్తులు, ఆలయ సిబ్బంది లాడ్జిల్లో చిక్కుకుపోయారు. అధికారులు, పోలీసులు అక్కడ సహాయకార్యక్రమాలు చేపడుతున్నారు. లాడ్జిలో చిక్కుకుపోయిన భక్తులకు సిబ్బందికి ఆహారం అందించారు. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు రెస్య్కూ బృందాలు నిర్మల్ నుండి బాసరకు బయలుదేరాయి.
Next Story






