గాయత్రిమాతగా భద్రకాళి అమ్మవారు

by Elthuri vijay kumar |

శ్రీ భద్రకాళి దేవస్థానంలో దేవిశరన్నవరాత్రులు మూడవ రోజు దేవాలయ అర్చకులు నిత్యహ్నికం నిర్వర్తించిన అనంతరం శ్రీ భద్రకాళి అమ్మవారిని గాయత్రిమాతగా అలంకరించారు.

గాయత్రిమాతగా భద్రకాళి అమ్మవారు
X

గాయత్రిమాతగా భద్రకాళి అమ్మవారు

మూడో రోజుకు చేరుకున్న దేవిశరన్నవరాత్రులు

దిశ, హన్మకొండ టౌన్ : శ్రీ భద్రకాళి దేవస్థానంలో దేవిశరన్నవరాత్రులు మూడవ రోజు దేవాలయ అర్చకులు నిత్యహ్నికం నిర్వర్తించిన అనంతరం శ్రీ భద్రకాళి అమ్మవారిని గాయత్రిమాతగా అలంకరించారు. బుధవారం రోజు అమ్మవారికి ఉదయం చంద్రఘంటా క్రమంలో సింహవాహన సేవ, సాయంకాలం మహిషమర్ధిని దుర్గా క్రమంలో గజవాహన సేవ లో పూజారాధనలు జరిపారు. రాక్షసులతో యుద్దం చేస్తున్న సందర్భంలో దిక్కులు పిక్కటిల్లెలా జగన్మాత చేసిన ఘంటానాదానికి అసూరీ శక్తుల తలలు పగిలి పోయేవని ఆ ఘంట కదిలకలు అర్ధ చంద్రాకారంలో ఉండటం వల్ల ఈమెకు చంద్ర ఘంటా అని పేరు వచ్చింది. చంద్ర ఘంటా క్రమంలోని అమ్మవారిని సేవించడం వలన సాధకుడిని పట్టిపీడిస్తున్న అసురీ శక్తులు దూరమైపోతాయని మహిషమర్ధిని క్రమంలో ఆరాదింపబడిన అమ్మవారు సాధకుడిలోని దుర్మదములను అణచివేసి జాడ్యాన్ని తొలగించి సాధన సక్రమంగా కొనసాగేలా చేస్తుందని ఆలయ ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు అయ్యగారు తెలిపారు. అమ్మవారి విశేష అలంకరణకు దుగ్యాల మనోహర్ రావు పద్మ దంపతులు నిహారిక అభిషేక రావు, చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. భక్తులందరికీ శ్రీ భద్రకాళి సేవా సమితి కన్వీనర్ అయితా గోపీనాథ్ ఆధ్వర్యంలో అశేష అన్నదానం నిర్వహించారు. సాయంకాలం నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా హరికథ, భక్తి సంగీతం, కర్నాటక సంగీతం, కూచిపూడి నృత్యాలు భక్తులను ఎంత గానో అలరించాయి.

Next Story