హైదరాబాద్‌కు గోదావరి జలాలు.. రూ.7,360 కోట్ల ప్రాజెక్టుపై జలమండలి కీలక ఒప్పందం

by Kema Shiva Kumar |

హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చే గోదావరి ప్రాజెక్టు పనుల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. రూ.7,360 కోట్లతో చేపట్టే 2, 3వ దశ పనుల కోసం మెగా ఇంజినీరింగ్ (MEIL) అనుబంధ సంస్థతో జలమండలి ఒప్పందం కుదుర్చుకుంది.

హైదరాబాద్‌కు గోదావరి జలాలు.. రూ.7,360 కోట్ల ప్రాజెక్టుపై జలమండలి కీలక ఒప్పందం
X

దిశ, తెలంగాణ బ్యూరో: గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్టు రెండు, మూడో దశ పనుల్లో కీలకఘట్టం ముగిసింది. ఈ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయడానికి కాంట్రాక్టు ఎజెన్సీ మెగా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికిల్(ఎస్పీవీ) అయిన మెయిల్ మల్లన్నసాగర్ వాటర్ ఇన్ఫ్రాప్రయివేటు లిమిటెడ్‌తో జలమండలి అగ్రిమెంట్ చేసుకున్నది. దీనికి సంబంధించి మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.

మూసీ పునరుజ్జీవనం కోసం ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను గోదావరి నీటితో నింపడంతో పాటు నగరానికి తాగునీటి సరఫరా కోసం చేపట్టిన గోదావరి ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ ప్రాజెక్టును చేపట్టడానికి రూ.7,360 కోట్ల మొత్తానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతిని మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును హ్యామ్ పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఏజెన్సీ 60శాతం పెట్టుబడి, ప్రభుత్వం 40శాతం నిధులను ఖర్చు చేయాల్సి ఉంది. 10 ఏండ్ల పాటు వరకు జరిగే నెలవారీ వార్షిక వాయిదా చెల్లింపుల సమయంలో 10.36 శాతం వడ్డీ రేటును అమలు చేయడం, మెయిల్ మల్లన్నసాగర్ వాటర్ ఇన్ఫ్రాప్రయివేటు లిమిటెడ్తో జలమండలి రాయితీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.

Next Story