కాళేశ్వరం వద్ద పెరిగిన గోదావరి ఉధృతి.. ప్రస్తుత నీటి మట్టం ఎంతంటే?

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-26 02:47:00  IST  )

మహారాష్ట్ర (Maharashtra)లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాళేశ్వరం వద్ద గోదావరి నది (Godavari River) ఉధృతంగా తీవ్ర స్థాయిలో ఉంది.

కాళేశ్వరం వద్ద పెరిగిన గోదావరి ఉధృతి.. ప్రస్తుత నీటి మట్టం ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర (Maharashtra)లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాళేశ్వరం వద్ద గోదావరి నది (Godavari River) ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సరస్వతి ఘాట్, మెయిన్ పుష్కర ఘాట్లను వరద నీరు తాకుతూ వెళ్తోంది. ప్రస్తుతం కాళేశ్వరం (Kaleshwaram) వద్ద గోదావరి నీటి మట్టం 8.700 మీటర్లుగా ఉంది. 4.87 క్యూసెక్కుల ప్రవాహం వస్తూ 9.80 మీటర్ల ఎత్తుతో మేడిగడ్డ బ్యారేజీ వైపు పరుగులు తీస్తోంది. అయితే, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని అన్నారం బ్యారేజీలో 6 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీలో నీటి మట్టం నీటి మట్టం 5.91 మీటర్లుగా ఉంది.

Next Story