కాళేశ్వరం వద్ద ఉధృతంగా గోదావరి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-11 07:15:34  IST  )

మహారాష్ట్ర (Maharashtra)లో కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం (Kaleshwaram) వద్ద గోదావరి (Godavari)తో పాటు ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

కాళేశ్వరం వద్ద ఉధృతంగా గోదావరి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర (Maharashtra)లో కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం (Kaleshwaram) వద్ద గోదావరి (Godavari)తో పాటు ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను చేశారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీలోకి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8,19,500 క్యూసెక్కులుగా ఉంది. దీంతో బ్యారేజీలోని 85 గేట్లను ఓపెన్ చేసి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా కాళేశ్వరం త్రివేణి సంగమం (Triveni Sangam) జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జ్ఞాన దీపాలు నీట మునిగాయి. ములుగు రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద 13.990 మీటర్ల ఎత్తులో గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తుంది. పేరూరు వద్ద 14.440 మీటర్ల ఎత్తులో గోదావరి వరద కొనసాగుతోంది. ములుగు జిల్లాలో మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువ కాగా, తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,42,150 క్యూసెక్కులు‌గా ఉంది. దీంతో అధికారులు 59 గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Next Story