బాసరలో గోదావరి ఉద్ధృతి.. లాడ్జిలు, కాటేజీల్లోకి చేరిన వరద

by Naga Rani Yarlagadda |

బాసరలో (Basara) మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నెలరోజుల వ్యవధిలో రెండోసారి అక్కడి లాడ్జిలు, కాటేజీలను వరద ముంచేసింది.

బాసరలో గోదావరి ఉద్ధృతి.. లాడ్జిలు, కాటేజీల్లోకి చేరిన వరద
X

దిశ, వెబ్‌డెస్క్: బాసరలో (Basara) మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నెలరోజుల వ్యవధిలో రెండోసారి అక్కడి లాడ్జిలు, కాటేజీలను వరద ముంచేసింది. గోదావరి వరదలతో అక్కడున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శరన్నవరాత్రుల (Dussehra Navratri) వేడుకలు, రేపు మూలనక్షత్రం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు బాసరకు భక్తుల తాకిడి పెరిగింది. ఈ క్రమంలో గోదావరి వరద (Godavari Floods) ముంచెత్తడంతో.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. పుష్కర ఘాట్ ను వరద ముంచేయడంతో నదీ స్నానాలకు అంతరాయం ఏర్పడింది. గంగానిత్య హారతి ఘాట్ వద్ద కూడా నీటిమట్టం పెరగడంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం కాటేజీల్లో ఉన్న భక్తులను ఖాళీ చేయించి.. పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

Next Story