న్యాయ రంగ అభివృద్ధే లక్ష్యం.. డాక్టరేట్ సాధించిన విద్యార్థి నేత కిరణ్ గౌడ్

by Ramesh Naini |

న్యాయ శాస్త్ర విభాగంలో విద్యార్థి నేత గుండగాని కిరణ్ గౌడ్ కి డాక్టరేట్ లభించింది.

న్యాయ రంగ అభివృద్ధే లక్ష్యం.. డాక్టరేట్ సాధించిన విద్యార్థి నేత కిరణ్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : న్యాయ శాస్త్ర విభాగంలో విద్యార్థి నేత గుండగాని కిరణ్ గౌడ్ (Kiran Goud Gundagani) కి డాక్టరేట్ లభించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సీనియర్ ప్రొఫెసర్ డా. జి. బి. రెడ్డి పర్యవేక్షణలో డాక్టరేట్ పట్టా పొందారు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ అండర్ సెవెంత్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ క్రిటికల్ స్టడీ అనే అంశంపై విశ్లేషణాత్మక పరిశోధనకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయ శాస్త్ర విభాగంలో డాక్టరేట్ ని ప్రధానం చేసింది. డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా కిరణ్ గౌడ్ మాట్లాడుతూ.. పీహెచ్‌డీ అంటే కేవలం అత్యున్నత డిగ్రీనే కాదు.. అది ఒక వ్యక్తి యొక్క పరిశోధన సామర్ధ్యానికి, అంకితభావానికి జ్ఞానానికి చేసే మౌలికమైన సహకారానికి నిదర్శనమని పేర్కోన్నారు.

భారత రాజ్యాంగంలోని ఏకీకృత చట్టపరమైన శక్తి పంపిణీ వ్యవస్థ, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు మరియు రాజ్యాంగిక సమతౌల్యంపై సవివర విశ్లేషణ చేశానని, తన పరిశోధన భారత శాసన వ్యవస్థలో పారదర్శకత, సమాఖ్య విలువలను బలపరచడం పైనే కేంద్రీకృతమైందని పేర్కోన్నారు. న్యాయ రంగ అభివృద్ధికి సేవలందించడం తన లక్ష్యం అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఐక్య విద్యార్థి సంఘాల వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న కిరణ్ గౌడ్, డా ఆంజనేయ గౌడ్ నేతృత్వంలోని టీఎస్ ఓయూ జేఏసీకి కన్వీనర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా కిరణ్‌ని యూనివర్సిటీ అధ్యాపకులు, రాజకీయ రంగ ప్రముఖులు, విద్యార్థి సంఘాల నాయకులు, మిత్రులు,శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.

Next Story