- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోవా కాసినో ఈవెంట్ లో మర్డర్.. హైదరాబాద్ రౌడీ షీటర్ అరెస్ట్..
గోవా కాసినో లో హైదరాబాద్ రౌడీ షీటర్ హల్ చల్ సృష్టించిన ఘటన చోటు చేసుకుంది.

దిశ, సిటీక్రైం : గోవా కాసినో లో హైదరాబాద్ రౌడీ షీటర్ హల్ చల్ సృష్టించిన ఘటన చోటు చేసుకుంది. బుధవారం రాత్రి జరిగిన గొడవలో కాసినో ఈవెంట్ సెక్యూరిటీ గార్డ్ ను హత్య చేసి పారిపోయి హైదరాబాద్ వస్తుండగా గోవా దబోలిమ్ ఎయిర్ పోర్ట్ లో రౌడీ షీటర్ ను గోవా పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ లో ఓ సంచలనం గా మారింది. హైదరాబాద్ మల్లెపల్లి కి చెందిన ఓ రౌడీ షీటర్ గోవా లో ఇటీవల కాలంలో పేకాట ఈవెంట్ లను నిర్వహిస్తున్నాడు.
ఈ ఈవెంట్ కు మైలార్ దేవ్ పల్లి కి చెందిన రౌడీ షీటర్ అల్తాఫ్, మరో ముగ్గురు స్నేహితులు రెండు రోజుల కిందట గోవా వెళ్లారు. బుధవారం రాత్రి గోవా పానాజీ క్యాంపుల్ లో ని కాసినో కు వెళ్లారు. అక్కడ అల్తాఫ్ గొడవపడి ఈవెంట్ కు సెక్యూరిటీ గార్డ్ లుగా ఉన్న ధీరు శర్మ, సత్యం గోంకర్ ల పై ఇనుప రాడ్ తో దాడి చేసాడు. ఈ దాడి లో గాయపడ్డ ధీరు శర్మ మరణించాడు. ఈ సంఘటన అనంతరం అల్తాఫ్ హైదరాబాద్ పారిపోయేందుకు గోవా లోని దబోలిమ్ ఎయిర్పోర్ట్ కు వచ్చాడు. సమాచారం తెలుసుకున్న గోవా పోలీసులు అల్తాఫ్ ను విమానాశ్రయం లో అరెస్ట్ చేసారు.
కేసును ఎస్పీ రాహుల్ గుప్తా సారధ్యం లో దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో పేకాట నిషేధం ఉండడం తో హైదరాబాద్ కు చెందిన పేరొందిన రౌడీ షీటర్ లు గోవా లో పేకాట ఈవెంట్ లను నిర్వహిస్తూ పేకాట రాయుళ్లను అక్కడికి విమానాల్లో షికారు చేయించి గాంబ్లింగ్ ను ఆడిస్తున్నారని తెలిసింది. దీంతో గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, హైదరాబాద్ కు చెందిన రౌడీ షీటర్ ల మధ్య ఇప్పుడు గోవా లో పేకాట ఈవెంట్లను నిర్వహించేందుకు ఫుల్ పోటీ నెలకొందని సమాచారం.






