- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Accreditations: జర్నలిస్టులకు అలర్ట్.. తెలంగాణలో అక్రిడిటేషన్లపై జీవో రిలీజ్
రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇచ్చే మీడియా అక్రెడిటేషన్ కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని జర్నలిస్టులకు అక్రిడిటేషన్ జారీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2016 నాటి పాత నిబంధనలను రద్దు చేస్తూ, 'తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్-2025'ను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 252 ను సోమవారం కె.రామకృష్ణరావు జారీ చేశారు. కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్ర స్థాయి (SMAC), జిల్లా స్థాయి (DMAC) అక్రెడిటేషన్ కమిటీల పదవీ కాలం రెండేళ్లుగా నిర్ణయించారు. కొత్త కమిటీలు ఏర్పాటయ్యే వరకు పాతవే కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ సమాచారాన్ని సేకరించేందుకు రిపోర్టర్లకు గుర్తింపుగా అక్రెడిటేషన్ కార్డు, డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డు ఇవ్వనున్నారు. మీడియా కార్డులు కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు మాత్రమే పనికివస్తాయిని పేర్కొన్నారు.
డిజిటల్ మీడియాకు తొలిసారి నిబంధనలు:
డిజిటల్ న్యూస్ మీడియాకు అక్రెడిటేషన్ ఇవ్వాలంటే సదరు వెబ్‌సైట్‌కు గత ఆరు నెలల్లో నెలకు కనీసం 5 లక్షల మంది విజిటర్స్ ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ మీడియా కేటగిరీలో గరిష్టంగా 10 కార్డులు మాత్రమే ఇస్తారని పేర్కొన్నారు.
ఎలిజిబిలిటీ క్రైటీరియా:
* న్యూస్ పేపర్లు: కనీసం 2,000 ప్రతులు పంపిణీ అవుతున్న దినపత్రికలే అక్రెడిటేషన్‌కు అర్హులు. PRGI రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
* ఎలక్ట్రానిక్ మీడియా: శాటిలైట్ ఛానళ్లు 50% వార్తా కంటెంట్‌ను కలిగి ఉండాలి. లోకల్ కేబుల్ ఛానళ్లు రోజుకు కనీసం 3 బులెటిన్లు టెలికాస్ట్ చేయాలి.
* జర్నలిస్టుల అర్హత: స్టేట్ లెవల్ అక్రెడిటేషన్ కోసం డిగ్రీ విద్యార్హత లేదా ఐదేళ్ల అనుభవం ఉండాలి.
•నియోజకవర్గ, మండల స్థాయి రిపోర్టర్లకు ఇంటర్మీడియట్ విద్యార్హత తప్పనిసరి.
ఫ్రీలాన్స్ & వెటరన్ జర్నలిస్టులు:
15 ఏళ్ల అనుభవం ఉన్న ఫ్రీలాన్సర్లు, 30 ఏళ్ల అనుభవంతో పాటు 58 ఏళ్లు నిండిన వెటరన్ జర్నలిస్టులు కూడా కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కమిటీల నిర్మాణం:
* రాష్ట్ర కమిటీ (SMAC): మీడియా అకాడమీ చైర్మన్ చైర్మన్‌గా, ఐఅండ్‌పిఆర్ కమిషనర్ కో-చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇందులో వివిధ జర్నలిస్ట్ యూనియన్ల ప్రతినిధులు, పీసీఐ సభ్యులు ఉంటారు.
* జిల్లా కమిటీ (DMAC): జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, డీపీఆర్వో మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
నిబంధనల ఉల్లంఘన జరిగితే:
అక్రెడిటేషన్ కార్డులను దుర్వినియోగం చేసినా, తప్పుడు సమాచారం ఇచ్చినా లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా కార్డులను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. పోగొట్టుకున్న కార్డుల స్థానంలో డూప్లికేట్ కార్డు కోసం రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.






