జీవో నెం.9ను ఉపసంహరించుకోవాలి: ఎస్‌ఎఫ్‌ఐ స్టేట్ కమిటీ డిమాండ్

by Kema Shiva Kumar |

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జారీ చేసిన జీవో నెం.9ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.

జీవో నెం.9ను ఉపసంహరించుకోవాలి: ఎస్‌ఎఫ్‌ఐ స్టేట్ కమిటీ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.9లోని నూతన నిబంధనలు పూర్తిగా విద్యార్థి వ్యతిరేకమైనవని, వాటిని భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజులు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల సంక్షేమం పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం వాస్తవానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యాసంస్థలపై అదనపు భారం మోపే చర్యగా మారిందని వారు విమర్శించారు. విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ఫీజు మొత్తాన్ని వారం రోజుల్లోగా కళాశాలలకు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, రికవరీ చేస్తామని పేర్కొనడం అత్యంత నిరంకుశ చర్య అని పేర్కొన్నారు. విద్యార్థి వ్యతిరేక జీవో నెం.9ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ హెచ్చరించింది.

Next Story