IMA : రోగుల భద్రతకు 'జీవో 229' తీవ్ర ముప్పు.. ఐఎంఏ వైద్యుల నిరసన

by Ramesh Naini |

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెం. 229 పై రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు భగ్గుమంటున్నారు.

IMA : రోగుల భద్రతకు జీవో 229 తీవ్ర ముప్పు.. ఐఎంఏ వైద్యుల నిరసన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెం. 229 పై రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు భగ్గుమంటున్నారు. ఆదివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హైదరాబాద్ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన తెలిపారు. ఈ జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుత నిరసన చేపట్టారు. ఐఎంఏ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ ఐలయ్య నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ అశోక్, ఐఎంఏ హైదరాబాద్ సిటీ బ్రాంచ్ ప్రెసిడెంట్-ఎలెక్ట్ డాక్టర్ బి.ఎన్. రెడ్డితో పాటు పలువురు సీనియర్ వైద్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జీవోకు వ్యతిరేకంగా వైద్యులు నినాదాలు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 229 రోగుల భద్రతకు, వైద్య విధానాల నైతికతకు విఘాతం కలుగుతుందని డా. ఐలయ్య తెలిపారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఈ జీవో తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ వివాదాస్పద జీవోను వెనక్కి తీసుకుని, వెంటనే గుర్తింపు పొందిన వైద్య సంఘాలతో అర్థవంతమైన చర్చలు జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Next Story