గ్లోబల్ సమ్మిట్: తెలంగాణ టచ్‌తో అతిథులకు రాయల్ వెల్కమ్! స్పెషల్ వంటకాలు ఇవే..

by Ramesh Naini |

గ్లోబల్ సమ్మిట్ హాజరయ్యే ప్రముఖులకు, అతిథుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బాస్కెట్‌లను అందజేయనుంది.

గ్లోబల్ సమ్మిట్: తెలంగాణ టచ్‌తో అతిథులకు రాయల్ వెల్కమ్! స్పెషల్ వంటకాలు ఇవే..
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: గ్లోబల్ సమ్మిట్ హాజరయ్యే ప్రముఖులకు, అతిథుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బాస్కెట్‌లను అందజేయనుంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌కు ప్రపంచం నలుమూలల నుంచి కార్పొరేట్ ప్రతినిధులు, పరిశ్రమల ప్రముఖులు, పెట్టుబడిదారులు హాజరుకానున్నారు. వీరి కోసం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా స్వాగతం పలకనుంది. హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే వారికి ఎప్పటికి గుర్తిండిపోయేలా సాంప్రదాయ కిట్లు, రుచికరమైన వంటకాలతో కూడిన ఫుడ్ బాస్కెట్లు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కిట్‌లో ఏముంటాయంటే..

సదస్సుకు హాజరయ్యే అతిథులకు అందించే స్పెషల్ బాస్కెట్ లో పోచంపల్లి ఇక్కత్ , ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ లోగోతో కూడిన సావనీర్ కిట్లను అందించనున్నారు. పోచంపల్లి శాలువా, చేర్యాల మాస్క్(పెయింటిగ్స్), హైదరాబాద్ అత్తర్, హైదరాబాద్ ముత్యాలతో చేసిన ఆభరణాలు ఇందులో ఉంటాయి. అదేవిధంగా ప్రత్యేక డిజైన్‌తో సిద్ధం చేసిన కల్చరల్ ఫుడ్ బాస్కెట్‌లో మహువ లడ్డులు, సకినాలు, అప్పాలు, బదామ్ కీ జాలి వంటి తెలంగాణ సాంప్రదాయ వంటకాలు ఉండనున్నాయి. ఈ సమిట్ ద్వారా తెలంగాణ కళలు, సంస్కృతి, వంటకాల ప్రత్యేకతను ప్రపంచ వేదికపై ప్రదర్శించనున్నారు.

Next Story