తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు రండి..

by velandi.Saikiran |   (  Updated:2025-12-05 22:31:05  IST  )

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానాలు అందించింది. స్వయంగా

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు రండి..
X

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు రండి..

- వివిధ రాష్ట్రాల సీఎంలను ఆహ్వానిస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రులు

- సమ్మిట్ కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దాదాపు 3వేల మంది ప్రముఖులు

- ప్రధానమంత్రికి ఆహ్వాన పత్రం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

- జార్ఖండ్ సీఎంను ఆహ్వానించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానాలు అందించింది. స్వయంగా రాష్ట్రానికి చెందిన మంత్రులు వెళ్లి ఆయా రాష్ట్రాల సీఎంలకు ఆహ్వాన పత్రికలు అందించారు. తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్ర బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడంలో భాగంగా ఈ సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన పనులు కూడా చకచకా పూర్తవుతున్నాయి. తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రాన్ని ఈ సమ్మిట్ లో ఆవిష్కరించనున్నారు. ఈ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని దాదాపు 3 వేల మంది ప్రము ఖులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ నిపుణులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, దౌత్యవేత్తలు హాజరుకానున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఈ సమ్మిట్‌ను దావోస్ సదస్సు తరహాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలకు కీలక వేదికగా ఇది మారనుంది. ఈ ఈవెంట్ కు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు. ఇక అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ఈ బాధ్యతను మంత్రులకు అప్పగించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో మంత్రి సీతక్క ఈమెయిల్ ద్వారా అధికారిక ఆహ్వానం పంపారు. ఆహ్వాన పత్రం అందిందని ధృవీకరిస్తూ, బెంగాల్ సీఎం కార్యాలయం ధన్యవాదాలు తెలిపింది. మంత్రి సీతక్క పంపిన ఆహ్వానాన్ని మమతా బెనర్జీకి వ్యక్తిగతంగా అందజేస్తామని కూడా సీఎంవో తెలియజేసింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాలని కోరుతూ అసోం సీఎంకు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆహ్వానం అందించారు.

జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాను ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్

తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమ్మిట్ కు హాజరవ్వాలని.. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు. న్యూఢిల్లీలోని జమ్ముకశ్మీర్ హౌస్‌లో సీఎం ఒమర్ అబ్దుల్లాను మంత్రి కలిసి ఈ మేరకు ఆహ్వానపత్రికను అందజేశారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. అయితే సమ్మిట్ కు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోతున్నాన ని, గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఆశిస్తు న్నట్లు జమ్మూ కశ్మీర్ సీఎం చెప్పారు. మరోవైపు సమ్మిట్‌కు రావాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ను మంత్రి ఉత్తమ్ ఆహ్వానించారు. చెన్నెలోని సీఎం కార్యాలయంలో స్టాలిన్ ను కలిసిన ఉత్తమ్... ఈ మేరకు ఆహ్వానం అందించారు.

ఏపీ సీఎం చంద్రబాబుకు కోమటిరెడ్డి ఆహ్వానం

'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానించారు. డి సెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో జరుగనున్న కార్యక్రమానికి రావాల్సిందిగా శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన కోమటిరెడ్డి దావో స్ తరహాలో సమ్మిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

గ్లోబల్ సమ్మిట్ కు వస్తా..

: హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు తప్పకుండా హాజరవుతానని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమం త్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు హామీ ఇచ్చారు. శుక్రవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లారు. ఈమేరకు సీఎం సుఖ్వీందర్ ను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు.

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ని ఆహ్వానించిన డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌కు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క ప్రత్యేకంగా ఆహ్వానించారు. శుక్రవారం జార్ఖండ్ సీఎం నివాసంలో జరిగిన భేటీలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ పొందించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను భట్టి... సీ ఎం హేమంత్ సోరెన్‌కి అందజేశారు. తెలంగాణను 3 ట్రి లియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభు త్వం ముందుకు సాగుతుందని, ఈ దిశగా అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యాలు, భవిష్యత్తు కార్యాచరణను నిర్వచించే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధమైందని భట్టి వివరించారు. నీతి ఆయోగ్ సలహాలు, నిపుణుల మేథోమథనం, పలు కార్యాచరణ రంగాల సమగ్ర విశ్లేషణ ఆధారంగా రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్‌ను హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీ ల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించనున్నట్లు డిఫ్యూటీ సీఎం తెలిపారు.

Next Story