- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kodandaram: గ్రూప్-1 వివాదం.. మంత్రి పొంగులేటితో కోదండరాం భేటీ
నిరుద్యోగ సమస్యలపై టీజేఎస్ చైర్మన్ కోదండరాం మంత్రి పొంగులేటితో భేటీ అయ్యారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని (Ponguleti Srinivas Reddy) టీజేఎస్ చైర్మన్ ప్రొ.కోదండరాం (Kodandaram) కోరారు. అలాగే రాబోయే ఖాళీల వివరాలతో కూడిన స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలన్నారు. ఇవాళ సెక్రటేరియట్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ను కోదండరాం కలిశారు. నిరుద్యోగుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు సహాయపడే సమగ్రమైన ఉద్యోగ వ్యవస్థను రూపొందించాలని కోరారు. గ్రూప్ -1 పరీక్ష ఫలితాలను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో మళ్లీ పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story






