- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇవాళ్టితో స్త్రీనిధి జాబ్స్ అప్లికేషన్ల ముగియనున్న గడువు.. ప్రభుత్వానికి నిరుద్యోగుల కీలక డిమాండ్
నిధి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచి, దరఖాస్తు గడువును 15 రోజులు పొడిగించాలని నిరుద్యోగుల డిమాండ్ చేస్తున్నారు

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల విడుదలైన స్త్రీ నిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని సవరించి దరఖాస్తు గడువును పొడిగించాలని రాష్ట్ర నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాల కోసం జనరల్ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం ఇటీవల 34 నుంచి 44 ఏళ్లకు పెంచినట్లుగానే స్త్రీ నిధి నియామకాల్లో పరిమితి పెంచాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం నిరుద్యోగులు ఓ ప్రకటన విడుదల చేశారు. గరిష్ఠ వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ జీవో నం.86 ను జారీ చేయడం హర్షించదగ్గ విషయం అని ఈ నిర్ణయంతో వయో పరిమితి సమస్యకు పరిష్కారం లభించిందనుకున్న సమయంలోనే స్త్రీ నిధి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల నోటిఫికేషన్‍లో గరిష్ఠ వయో పరిమితిని కేవలం 30 ఏళ్లుగా పేర్కొనడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మే 29 చివరి తేదిగా నిర్ణయించడంతో ఎంతో మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేసే అవకాశం కోల్పోతున్నారని అందువల్ల వయోపరిమితిని సవరించడంతో పాటు దరఖాస్తుల గడవును మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోరారు.
బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయండి:
ప్రభుత్వం విద్యాసంస్థలు రాష్ట్ర ప్రభుత్వ నియామకాలలో షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) రిజర్వేషన్ కోటాను 6శాతం నుండి 10శాతానికి పెంచుతూ అధికారికంగా జీవో నం.33 జారీ చేశారు. కానీ ప్రస్తుత స్త్రీ నిధి నియామకాల్లో పెరిగిన రిజర్వేషన్లు అమలు చేయకుండా పాత 6 శాతం రిజర్వేషన్లతోనే నియామకాలు చేయడం శోచనీయం అన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు, ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, సీఎం ప్రజావాణి నోడల్ అధికారిణి దివ్య దేవరాజన్‍కు ఈ నెల 22వ తేదీన వినతి పత్రాన్ని సమర్పించినట్లు నిరుద్యోగులు తెలిపారు.






