ఒకే గదిలో అమ్మాయిలు, అబ్బాయిలు.. కో లివింగ్ కల్చర్‌ను ప్రోత్సహిస్తున్న హాస్టల్ ఓనర్స్

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-05-03 15:04:42  IST  )

హైదరాబాద్ నగరంలో నయా ట్రెండ్ షురూ అయింది. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఒకే రూమ్‌లో ఉండే హాస్టల్స్ పుట్టుకొచ్చాయి.

ఒకే గదిలో అమ్మాయిలు, అబ్బాయిలు.. కో లివింగ్ కల్చర్‌ను ప్రోత్సహిస్తున్న హాస్టల్ ఓనర్స్
X

హైదరాబాద్ నగరంలో నయా ట్రెండ్ షురూ అయింది. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఓకే రూమ్‌లో ఉండే హాస్టల్స్ పుట్టుకొచ్చాయి. వీటిని కోలివింగ్ హాస్టల్స్, కోలివింగ్ పీజీలు అని పిలుస్తారు. గతంలో ఇలాంటి హాస్టల్స్‌కు ఉన్నా కూడా ఎవరికీ తెలిసేవి కావు. ఇప్పుడు మాత్రం పబ్లిక్‌గానే ప్రచారం చేసుకుంటున్నారు. సీసీ కెమెరాల నిఘా, ప్రీమియమ్, లగ్జరీ హోటల్స్ దొరికే సౌకర్యాల సేవలను ఈ పీజీల యాజమాన్యం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ హాస్టల్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇవి హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ ఉన్నాయి? రెంట్లు, సౌకర్యాలు ఎలా ఉన్నాయో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

ఫోక్ సాంగ్ వీడియోలతో జనాల్లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది జాను లిరి. ఆమె వేసే స్టెప్పులు, పాటలు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా జాను సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టి నెటిజన్లకు భారీ షాక్ ఇచ్చింది. పెళ్లి చేసుకోబోయే అతడి ఫొటోను రివీల్ చేసింది. ‘ఫైనల్లీ.. నాకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు నన్ను ఆశీర్వదించండి’ అంటూ ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇంతకు అతను ఎవరో తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి చూడాల్సిందే..

కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి సీతక్క హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో స్కీముల పేరుతో స్కామ్‌లు చేశారని ఆరోపించారు. గొర్రెల పంపిణీ స్కీమ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం కింద పేద ప్రజల నుంచి డబ్బులు తీసుకున్న వారిని ముక్కుపిండి వసూలు చేస్తామన్నారు. తమ ప్రభుత్వంలో ఈ పథకాన్ని వినూత్నంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ స్కీంకు సంబంధించిన వివరాలపై సీతక్క ఇంకా ఏం చెప్పిందో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

ఏపీలో జగన్ అనే ముష్కరుడు అమరావతిని నాశనం చేశాడని మంత్రి ఆదినారాయణరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఐదేళ్ల పాటు అమరావతి ప్రజలను ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు ప్రధాని మోడీ సహకారంతో, సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతి అభివృద్ధి చెందుతోందని చెప్పారు. జగన్‌కు అప్పులు‌ చేయడం, తప్పులు చేయడమే తెలుసని ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటే ఏంటి, ఎలా చేయాలో జగన్‌కు తెలియదని విమర్శించారు. చట్టపరంగా జగన్‌కు శిక్షలు తప్పవని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

Next Story