- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: ప్రియుడి ఇంట్లో ప్రియురాలు సూసైడ్.. జరిగింది చూసి భయంతో ప్రియుడు..
ప్రియుడి కోసం తన మూడేళ్ల బాబుతో వచ్చిన ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లో తీవ్ర కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రియుడి కోసం వచ్చిన ప్రియురాలు చివరకు బాయ్ ఫ్రెండ్ ఇంట్లోనే ఆత్మహత్యకు (Girlfriend suicide) పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నాగోల్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగోల్ (Nagole) పరిధిలో నివాసం ఉంటున్న బానోత్ అనిల్ నాయక్ (24) (Banoth Anil Naik) అనే యువకుడితో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ (38) (Mahabubabad woman) అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రియుడిని కలిసేందుకు తన మూడేళ్ల బాబుకు చికిత్స చేయిస్తానని చెప్పిన సదరు మహిళ.. మహబూబాబాద్ జిల్లా నుంచి అనిల్ వద్దకు వచ్చింది. రెండు రోజుల పాటు తన ప్రియుడితోనే గడిపిన ఆమె 21వ తేదీన డేంజర్ డెసిషన్ తీసుకుంది. కూరగాయల కోసం అనిల్ బయటకు వెళ్లి వచ్చేసరికి బాత్ రూమ్‍లో చీరకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
రూమ్ కు తిరిగి వచ్చి చూసిన అనిల్ జరిగింది చూసి షాక్ అయ్యాడు. చుట్టుపక్కల వారిని సహాయం కోసం పిలిస్తే ఏమనుకుంటారోననే ఆందోళనతో తానే తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి ఆమె తుది శ్వాస విడిచింది. దీంతో భయపడిపోయిన అనిల్ వెంటనే చేయి కోసుకుని తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. కానీ ఎదురుగా మూడేళ్ల బాబు ఏడుస్తుండడంతో తమ మనసు మార్చుకుని చేతికి గుడ్డను చుట్టుకుని నేరుగా పోలిస్టేషన్ కు వెళ్లాడు. అక్కడ జరిగిందంతా చెప్పాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటన స్థలానికి చేరుకున్న వివాహిత బంధువులు అనిల్‍ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా అనిల్‍పై కేసు నమోదు చేసిన పోలీసుల అతడిని రిమాండ్ కు తరలించారు.






