నరసింహస్వామి జయంతి.. యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ

by Naga Rani Yarlagadda |

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా యాదగిరి గుట్టలో (Yadagirigutta) ఆదివారం ఉదయం ఆలయ నిర్వాహకులు గిరిప్రదక్షిణ చేపట్టారు. ఆలయ ఈఓ వెంకట్రావ్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణను (Giri Pradakshina) ప్రారంభించగా.. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నరసింహస్వామి జయంతి.. యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా యాదగిరి గుట్టలో (Yadagirigutta) ఆదివారం ఉదయం ఆలయ నిర్వాహకులు గిరిప్రదక్షిణ చేపట్టారు. ఆలయ ఈఓ వెంకట్రావ్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణను (Giri Pradakshina) ప్రారంభించగా.. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సంస్థలు, భక్త సమాజాలకు చెందిన వారు ఉత్సాహంగా పాల్గొని.. గోమాత, జాతీయ పతాకాలతో భక్తులు కొండచుట్టూ ప్రదక్షిణ చేసి.. స్వామి వారిని దర్శించుకున్నారు. పాతగుట్ట క్షేత్రంలోనూ నరసింహస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కొండపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక, సంగీత, భజన, కూచిపూడి ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.

Next Story