జీహెచ్‌ఎంసీలో వార్డుల సంఖ్య 150 నుంచి 300లకు పెంపు

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-08 17:04:15  IST  )

జీహెచ్‌ఎంసీలో వార్డుల సంఖ్య 150 నుంచి 300లకు పెంపు

జీహెచ్‌ఎంసీలో వార్డుల సంఖ్య 150 నుంచి 300లకు పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్‌ఎంసీని 300 వార్డులుగా విభజించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన 266 జీవోను సోమవారం విడుదల చేసింది. కాగా, జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయడంతో ఇప్పటికే హైదరాబాద్ మరింత మహానగరంగా మారింది. విలీనంతో జీహెచ్ఎంసీ 30 సర్కిళ్లతోపాటు మరో 27సర్కిళ్లుగా గుర్తించారు. మొత్తం సర్కిళ్ల సంఖ్య 57కి చేరింది. ఇందులో భాగంగానే వార్డుల పునర్విభజనకు సంబంధించిన పనులను కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం, టౌన్ ప్లానింగ్ అధికారులు పూర్తిచేశారు. గతవారం రోజులుగా ప్రాథమిక సమాచారాన్ని సేకరించడంతోపాటు సరిహద్దుల గుర్తింపు, మ్యాపింగ్ వంటి పనులు పూర్తిచేశారు. తాజాగా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేయడంతో వార్డుల పునర్విభజన ప్రక్రియను సోమవారం నుంచి అధికారికంగా ప్రారంభించినట్టు అధికారులు చెబుతున్నారు.

Next Story