- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GHMC: చర్చనీయాంశంగా మారిన సీఎం, మేయర్ ల భేటీ..!
అవిశ్వాసం వార్తలు వస్తున్న నేపథ్యంలో మేయర్(Mayor) వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలవడం ఆసక్తికరంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్: అవిశ్వాసం వార్తలు వస్తున్న నేపథ్యంలో మేయర్(Mayor) వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలవడం ఆసక్తికరంగా మారింది. సింగపూర్, దావోస్ పర్యటనలు విజయవంతంగా ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన జూబ్లీహిల్స్(Jubleehills) లోని తన నివాసానికి చేరుకున్న కొద్ది సేపటికే మేయర్ గద్వాల విజయలక్ష్మీ(Mayor Gadwala vijayalakshmi), తన తండ్రి ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు(K Keshava Rao) తో కలిసి వెళ్లి రేవంత్ రెడ్డితో భేటీ(Meeting) అయ్యారు. రాష్ట్రానికి రికార్డు స్థాయిలో రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేసిన మేయర్.. సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఇటీవలే జీహెచ్ఎంసీ మేయర్(GHMC Mayor), డిప్యూటీ మేయర్ లపై అవిశ్వాసం అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే మేయర్ వెళ్లి కలవడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నా పదవి గండం భయంతోనే మేయర్ సీఎంను కలిసినట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. దీంతో మేయర్ నిజంగానే సీఎంకు విషెస్ చెప్పేందుకు వెళ్లిందా? లేక ఆమెకు తన మేయర్ పదవి పోతుందని భయం ఏర్పడిందా? అనేది చర్చనీయాంశంగా మారింది.






