కాసేపట్లో GHMC స్పెషల్ కౌన్సిల్ సమావేశం.. వార్డుల డీలిమిటేషన్ అభ్యంతరాలపై చర్చ

by Kema Shiva Kumar |

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై అన్ని వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

కాసేపట్లో GHMC స్పెషల్ కౌన్సిల్ సమావేశం.. వార్డుల డీలిమిటేషన్ అభ్యంతరాలపై చర్చ
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై అన్ని వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10.30కి మేయర్ గద్వాల విజయలక్ష్మి (Mayor Vijaya Lakshmi) అధ్యక్షతన స్పెషల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో వార్డుల డీలిమిటేషన్‌పై కార్పొరేటర్లు, ఎక్స్-ఆఫీషియో మెంబర్లు తమ అభ్యంతరాలు, సూచనలను సభలో వ్యక్తం చేయనున్నారు.

కాగా, తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో వార్డుల సంఖ్యను రెట్టింపు చేస్తూ డిసెంబర్ 9న ప్రిలిమినరీ డీలిమిటేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. జనాభా ఆధారంగా వార్డు సరిహద్దులను నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. అభ్యంతరాలు, సూచనలకు డిసెంబర్ 17 వరకు గడువు ఇచ్చారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 1,300కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. అయితే, వార్డుల విభజన ప్రక్రియను అశాస్త్రీయంగా, ఏకపక్షంగా జరిపారని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరపకుండా ప్రధాన కార్యాలయంలో కూర్చొని వార్డుల విభజన చేశారంటూ ఫైర్ అయ్యారు. జనాభా అసమతుల్యత, భౌగోళిక సౌలభ్యం, సహజ సరిహద్దులను పరిగణనలోకి తీసుకోలేదని ఆగ్రహం చేశారు. దీంతో వార్డుల డీలిమిటేషన్ విషయంలో అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఇవాళ మేయర్ అధ్యక్షతన స్పెషల్ కౌన్సిల్ సమావేశం జరగబోతోంది.

Next Story