- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెంట్ హౌస్ కూల్చేస్తాం.. అల్లు అరవింద్ ఇంటికి జీహెచ్ఎంసీ నోటీసులు
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. అనుమతి లేకుండా నిర్మించిన పెంట్ హౌస్ కూల్చేస్తామని సోమవారం జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind)కు జీహెచ్‌ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. అనుమతి లేకుండా నిర్మించిన పెంట్ హౌస్ (Penthouse) కూల్చేస్తామని సోమవారం జీహెచ్ఎంసీ అధికారులు (GHMC officials) నోటీసులు ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో అల్లు అరవింద్ బిజినెస్ పార్క్ భవనాన్ని.. సుమారు వెయ్యి గజాల విస్తీర్ణంలో నిర్మించారు. అయితే దీనికోసం గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు నాలుగు అంతస్తుల వరకు జీహెచ్‌ఎంసీ నుంచి అధికారిక అనుమతులు పొందారు. సుమారు ఏడాది క్రితం నిర్మాణం పూర్తవ్వగా వాణిజ్య వినియోగంలోకి వచ్చింది. అయితే, ఇటీవల అనుమతి ఎటువంటి అనుమతి తీసుకోకుండా.. నాలుగో అంతస్తుపై కొత్తగా పెంట్‌హౌస్ నిర్మించారు.
ఇది గమనించిన టౌన్ ప్లానింగ్ అధికారులు (Town planning officials).. ఇది భవన నిర్మాణ నిబంధనలకు విరుద్ధమని తేల్చారు. దీంతో అక్రమ నిర్మాణాన్ని (Illegal construction) ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ నోటీసులు (GHMC notices) జారీ చేసింది. ఉన్నత స్థాయిలో ఉన్న ప్రముఖులే ఇలాంటి అక్రమ నిర్మాణాలకు పాల్పడటం నగర పాలక సంస్థను కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకు వచ్చిందని అధికారులు అంటున్నారు. ఇక ఈ భవనం ఇప్పటికే వాణిజ్య కార్యకలాపాల కోసం ఉపయోగించబడుతున్న నేపథ్యంలో, అక్రమ నిర్మాణంపై జీహెచ్‌ఎంసీ తదుపరి చర్య ఏంటి అన్న దానిపై ఆసక్తి నెలకొంది. అల్లు అరవింద్ వివరణ ఇచ్చే వరకు పెంట్‌హౌస్ భవితవ్యంపై నిర్ణయం నిలిచిపోయింది.






