- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెల్ఫీ పాయింట్స్.. రేపటి నుంచి GHMC మెగా శానిటేషన్ డ్రైవ్
నగరాన్ని మరింత శుభ్రంగా, సుస్థిరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) రేపటి నుంచి మెగా శానిటేషన్ డ్రైవ్‌ను ప్రారంభించనుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: నగరాన్ని మరింత శుభ్రంగా, సుస్థిరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) రేపటి నుంచి మెగా శానిటేషన్ డ్రైవ్‌ను ప్రారంభించనుంది. డిసెంబర్ 29 నుంచి జనవరి 31 వరకు కొనసాగనున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రతిరోజూ 300 వార్డులను కవర్ చేస్తూ విస్తృత స్థాయిలో పరిశుభ్రత పనులు చేపట్టనున్నారు. వార్డు డీలిమిటేషన్ అనంతరం నిర్వహిస్తున్న తొలి పెద్ద స్థాయి శానిటేషన్ డ్రైవ్ కావడం విశేషం. ఈ డ్రైవ్‌లో భాగంగా నగరంలో పేరుకుపోయిన లెగసీ వ్యర్థాలను తొలగించడం, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ (GVPs)ను పూర్తిగా నిర్మూలించడం, నిర్మాణ, కూల్చివేత (C&D) వ్యర్థాల తొలగింపు వంటి చర్యలు చేపడతారు.
అలాగే ప్రధాన రహదారులు, ఫ్లైఓవర్లు, నాలాలు, పార్కులు, ఫుట్‌పాత్‌లను శుభ్రం చేయనున్నారు. పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించే వారిపై స్పాట్ ఫైన్లు విధించనున్నారు. తొలగించిన GVPలను అందంగా అలంకరించి ‘సెల్ఫీ పాయింట్స్’గా అభివృద్ధి చేయాలని GHMC భావిస్తోంది. దీని ద్వారా ప్రజల్లో అవగాహనతో పాటు బాధ్యత భావం పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.






