- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్ఎంసీ కొత్త పంథా
జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కల నియంత్రణ సవాల్‌గా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కల నియంత్రణ సవాల్‌గా మారింది. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఫలితం లేకుండా పోయింది. ప్రమాదకరమైన, దీర్ఘకాలికంగా రోగాలబారిన కుక్కలను నియంత్రించడానికి ఉన్న చట్టాలను పట్టించుకోలేదనే విమర్శలూలేకపోలేదు. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ఎంతో మంది చిన్నారులు కుక్కల దాడుల్లో మృతిచెందారు. అయితే 2023లో అంబర్‌పేట్‌లో నాలుగేండ్ల బాలుడిని కుక్కల పీక్కుతిన్న సంఘటను హైకోర్టు సుమోటగా స్వీకరించింది. ఈ కేసు నేపథ్యంలో కుక్కల నియంత్రణ ఖర్చు వివరాలు, ప్రమాదకరమైన కుక్కలను చంపడానికి అనుమతివ్వాలని హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో 3.79 లక్షల వీధి కుక్కలున్నాయి. వీటిలో 77 శాతం కుక్కలకు మాత్రమే స్టెరిలైజేషన్ చేస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
మూడేండ్లలో ఏబీసీ, ఏఆర్‌లకు రూ29.66 కోట్లు..
కుక్కల నియంత్రణకు ‘కంట్రోల్ ఆఫ్ స్ట్రే యానిమల్స్’ హెడ్ పేరుతో ప్రతి ఏడాది నిధులు కేటాయిస్తున్నారు. స్టెరిలైజేషన్స్, వ్యాక్సినేషన్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఇతర జంతువుల సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు మూడేండ్లలో రూ.29.67 కోట్లు ఖర్చు చేశారు. యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ), యాంటీ రేబిస్ (ఏఆర్) కార్యక్రమాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయినా 70 శాతం కుక్కలకు ఆపరేషన్లు కూడా చేయలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
కుక్కల నియంత్రణలో భాగంగా స్టెరిలైజేషన్, యాంటి రేబీస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలను నిర్వహించే యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్(ఏడబ్ల్యూఓ)లకు జీహెచ్ఎంసీ నుంచి ఆర్థికంగాను, లాజిస్టికల్ గాను సపోర్ట్ చేస్తోంది. ఐదు సంస్థలకు కుక్కల ఆఫరేషన్లు, ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు ఐదేండ్లలో రూ.9.18 కోట్లు ఖర్చు చేశారు.
గ్రేటర్‌లో 1.10 లక్షల కుక్కకాటు కేసులు..
జీహెచ్ఎంసీ పరిధిలో 3.79 లక్షల వీధి కుక్కలున్నాయి. వీటిలో 77 శాతం కుక్కలకు మాత్రమే స్టెరిలైజేషన్ చేస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీంతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో మూడేండ్ల పాటు 1.10 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3.33 లక్షలు కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. వీరిలో మూడేండ్ల కాలంలో కుక్కకాటు కారణంగా 36 మంది చనిపోయారు.
ఆ కుక్కలను చంపడానికి..
వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్ఎంసీ కొత్త పంథాను ఎంచుకుంది. 1960 ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ యాక్ట్ 1960లోని సెక్షన్ 11(3)(బీ), 11(3)(సీ), జీహెచ్ఎంసీ 1955 చట్టంలోని సెక్షన్ 249 ప్రకారం ప్రమాదకరమైన, దీర్ఘాకాలిక రోగాలబారినపడిన కుక్కలను యుథానాసియా(మెర్సీ కిల్లింగ్) ద్వారా (కుక్కలకు స్టెరిలైజేషన్ సమయంలో మత్తు ఇంజెక్షన్లను ఎక్కువ మోతాదులో ఇచ్చి చంపడం) చంపడానికి అనుమతివ్వాలని హైకోర్టును కోరింది. అయితే దీనిపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటనేది చూడాల్సిందే. ఒకవేళ మెర్సీ కిల్లింగ్‌కు హైకోర్టు అనుమతిస్తే యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారమే ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. 2008లో బాంబే హైకోర్టు, 2015లో కేరళ హైకోర్టులు కుక్కలను మెర్సీ కిల్లింగ్‌కు అనుమతిచ్చాయి. ఈ అంశాన్ని సవాల్ చేస్తూ యానిమల్ యాక్టివిస్టులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. కేంద్ర పశుసంవర్ధక శాఖ కూడా 2022లో తెచ్చిన యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్‌లో మెర్సీ కిల్లింగ్‌ను సమర్థించింది.






