- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు షాక్ ఇచ్చిన జీహెచ్ఎంసీ
హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్/జూబ్లీహిల్స్: హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ అధికారులు (GHMC officials) షాక్ ఇచ్చారు. వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపించి సంవత్సరాలుగా ట్రేడ్ లైసెన్స్ ఫీజులు (Trade license fees) భారీగా ఎగవేతకు పాల్పడుతున్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు. తాజా డేటా ప్రకారం.. రూ. 11.52 లక్షలు ఫీజు చెల్లించవలసిన అన్నపూర్ణ స్టూడియో (Annapurna Studio), కేవలం రూ. 49 వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు తేలింది.
అలాగే విధంగా రూ. 1.92 లక్షలు చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియోస్ (Ramanaidu Studios), కేవలం రూ. 1,900 మాత్రమే చెల్లిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దర్యాప్తు నిర్వహించి, ఇరు స్టూడియోలకు పూర్తి స్థాయి ట్రేడ్ లైసెన్స్ ఫీజులను తక్షణమే చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. మరి ఈ నోటీసులపై రెండు ప్రముఖ స్టూడియోలు ఎంత మేరకు వివరణ ఇస్తాయో తెలియాల్సి ఉండగా.. బల్దియా తదుపరి చర్య ఏమిటోనని ఆసక్తి నెలకొంది.






