- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెల రోజుల్లో ఐదుగురు ఆస్పత్రి పాలు.. గడువు ముగిసి నెల రోజులైనా అధికారుల నుంచి నో రియాక్షన్
జీహెచ్ఎంసీ ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ ముగిసి నెల రోజులైనా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఇన్సూరెన్స్ లేక ఆస్పత్రి పాలైన ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ ముగిసి నెల రోజులైనా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఇన్సూరెన్స్ లేక ఆస్పత్రి పాలైన ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ శానిటేషన్ జవాన్‌కు హార్ట్ అటాక్ రావడంతో స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. రూ.5లక్షలు అవుతుందని ఆస్పత్రి తేల్చి చెప్పడంతో డబ్బులు కట్టలేక, ఇన్సూరెన్స్ లేక ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
ఐదుగురు ఆస్పత్రిపాలు..
నెలరోజులుగా ఐదుగురు ఉద్యోగులు అనారోగ్యంతో ఆస్ప్రతి పాలైనట్లు యూనియన్ నేతలు చెబుతున్నారు. 2019 నుంచి జీహెచ్ఎంసీ లో పనిచేస్తున్న సుమారు 5600 మంది ఉద్యోగులకు 2019 నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తోంది. అంతకుముందు ఉద్యోగులు హాస్పిటల్లో జాయిన్ అయితే.. ఆ బిల్లులు తీసుకొచ్చి క్లెయిమ్ చేసుకునేవారు.. బిల్లులు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి ఉండేది.. దీంతో ఉద్యోగులకు అప్పటి కమిషనర్ లోకేష్ కుమార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చారు. మొదట హెల్త్ ఇన్సూరెన్స్ మూడు లక్షల వరకు కవర్ అయ్యేది.. ఆ తర్వాత 5 లక్షల వరకు కవర్ అయ్యేలా చేశారు.
అయితే ఇన్నిరోజులు పాటు ఉన్న బజాజ్ హెల్త్ ఇన్సూరెన్స్ సరిగా పనిచేయడం లేదని.. కొన్ని ఆస్పత్రుల్లో పనిచేయడం లేదని ఉన్నతాధికారులకు ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. పేరుకే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఎమర్జెన్సీలో ఎక్కడా పనిచేయడం లేదని ఉన్నతాధికారులకు తెలిపారు. కొన్ని ఆస్పత్రుల్లో జాయిన్ అయినా తర్వాత ఇన్సూరెన్స్ పని చేయట్లేదని సతాయించేవారని తెలిపారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ ఫిబ్రవరి 14 తో ముగిసింది. బల్దియా నుంచి ప్రీమియం కట్టకపోవడంతో రెన్యువల్ కాలేదు. కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ టెండర్లు ఏడు కంపెనీలకు చెందిన ప్రతినిధులు టెండర్ దాఖలు చేశారు. వీటిని ఓపెన్ చేయడంతో పాటు అగ్రిమెంట్ చేసుకోవడానికి మరో నెలరోజులు పడుతుందని ఉద్యోగులు, యూనియన్ నేతలు చెబుతున్నారు. ప్రీమియం ముగియడానికి రెండు నెలల ముందుగానే అధికారులకు గుర్తు చేసిన ఫలితం లేదని యూనియన్ నేతలు విమర్శిస్తున్నారు.
శానిటరీ జవాన్ కు హార్ట్ ఎటాక్..
జీహెచ్ఎంసీకి చెందిన ఓ శానిటేషన్ జవాన్ కి హార్ట్ ఎటాక్ రావడంతో ఖైరతాబాద్ లోని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఐదు స్టంట్స్ వేయాలని, ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందని హాస్పిటల్ వర్గాలు చెప్పారు. తమకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని హాస్పిటల్ వారికి వెళితే ... ఇది గడువు ముగియడంతో చెల్లదని, మొత్తం డబ్బులు చెల్లిస్తనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై కమిషనర్, అడిషనల్ కమిషనర్(అడ్మిన్)ని కలిసినా ఫలితం లేదని భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని హెల్త్ ఇన్సూరెన్స్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.






