జిహెచ్ఎంసీ డీఎంసీల నియామకం

by Thanuru Gopichand |

జీహెచ్ఎంసీలో 27మున్సిపాలిటీల విలీనంతో ఏర్పడిన బృహత్ హైదరాబాద్‌లో 300 వార్డులు, 60 సర్కిళ్లు, 12 జోన్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తయిన విషయం తెలిసిందే.

జిహెచ్ఎంసీ డీఎంసీల నియామకం
X

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీలో 27మున్సిపాలిటీల విలీనంతో ఏర్పడిన బృహత్ హైదరాబాద్‌లో 300 వార్డులు, 60 సర్కిళ్లు, 12 జోన్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తయిన విషయం తెలిసిందే. అంతేకాదు 12 జోన్లకు జోనల్ కమిషనర్లను కేటాయించిన కమిషనర్ కర్ణన్ 60 సర్కిళ్లకు డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లను కేటాయిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. అయితే 27 యూఎల్బీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసిన తర్వాత వాటిని 27 సర్కిళ్లుగా గుర్తించిన విషయం తెలిసిందే. వాటికి కేటాయించిన మున్సిపల్ కమిషనర్లలో 8 మందికి జీహెచ్ఎంసీ కొత్త సర్కిళ్ల అవకాశమివ్వలేదు. సరస్వతి, ఎన్.వెంకట్ రెడ్డి, పి.రాజేశ్, ఆర్.వేణుగోపాల్, చంద్రప్రకాష్, ఎ.జ్యోతిరెడ్డి, బి.కిషన్, అజయ్ కుమార్ రెడ్డిలను పేరెంట్ డిపార్ట్‌మెంట్‌కు సరెండర్ చేశారు. 27 మున్సిపాలిటీల్లో పనిచేసిన ఏడుగురు మున్సిపల్ కమిషనర్లకు కొత్తగా ఏర్పడిన జీహెచ్ఎంసీ సర్కిళ్లు సైతం అవే పేర్లతో ఉండడంతో వారికి అక్కడే పోస్టింగ్ ఇచ్చారు. నార్సింగి డీఎంసీ కృష్ణామోహన్ రెడ్డి, నిజాంపేట్ డీఎంసీ సాబేర్ అలీ, జల్‌పల్లి డీఎంసీ వెంకట్ రామ్, శంషాబాద్ డీఎంసీ సుమన్ రావు, బోడుప్పల్ డీఎంసీ ఎ.శైలజ, దుండిగల్ డీఎంసీ వెంకటేశ్వర నాయక్, కోంపల్లి డీఎంసీ ఎన్.కృష్ణారెడ్డి ఈ జాబితాలో ఉన్నారు.

శానిటేషన్ విభాగాలపై ఫోకస్

జోనల్ కమిషనర్లు, డిప్యూటీ ము న్సిపల్ కమిషనర్లను నియమించిన కమిషనర్ ఇంజినీరింగ్, ప్లానింగ్, హెల్త్, శానిటేషన్ విభాగాలపై ఫోక స్ పెట్టారు. జోన్‌కు సూపరింటెండెంట్ ఇంజినీర్, సర్కిల్‌కు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను నియమించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. హెల్త్ అండ్ శానిటేషన్ విభాగాల్లో నూ పనిచేయడానికి పర్యావరణ ఇం జినీర్లు, మెడికల్ ఆఫీసర్లను సైతం నియమించాల్సి ఉంది. ఈ పోస్టుల గురించి ప్రభుత్వానికి కమిషనర్ లే ఖ రాసినట్టు సమాచారం.

సర్కిళ్ల పేరు డిప్యూటీ కమిషనర్

  • కీసర - ఎన్.వసంత
  • ఆల్వాల్ - తిప్పర్తియాదయ్య
  • బోయిన్‌పల్లి - డాకు నాయక్
  • మౌలాఅలీ - బి.గోపాల్ రావు
  • మల్కాజ్‌గిరి - జకీయ సుల్తాన
  • ఘట్‌కేసర్ - వాణి
  • కాప్రా - కె.శ్రీహరి
  • నాచారం - నిత్యానంద్
  • ఉప్పల్ - జి.రాజు
  • బోడుప్పల్ - ఎ.శైలజ
  • నాగోల్ - ఎస్.రవీందర్ రెడ్డి
  • సరూర్ నగర్ - బొనగిరి శ్రీనివాస్ రావు
  • ఎల్బీనగర్ - మల్లిఖార్జున్ రావు
  • హయత్ నగర్ - వంశీకృష్ణ
  • ఆదిభట్ల - సత్యనారాయణరెడ్డి
  • బడంగ్‌పేట్ - థ్రిల్లేశ్వర్ రావు
  • జల్‌పల్లి - బి.వెంకట్ రామ్
  • శంషాబాద్ - బి.సుమన్ రావు
  • రాజేంద్రనగర్ - బి.సురేందర్ రెడ్డి
  • అత్తాపూర్ - వి.సమ్మయ్య
  • బహుదుర్‌పుర - శరత్ చంద్ర
  • ఫలక్‌నుమా - సి.అరుణకుమారి చరణ్
  • చంద్రాయన్‌గుట్ట - వి.సురేందర్
  • జంగ‌మెంట్ - ఎ.నాగమణి
  • సంతోష్ నగర్ - మంగతయారు
  • యాకుత్‌పుర - సుభాష్ రావు
  • మలక్‌పేట్ - ఎంకేఐ అలీ
  • చార్మినార్ - ఎల్.సరిత
  • ముసారాంబాగ్ - ఎస్.భాస్కర్ రెడ్డి
  • గోషామహల్ - ఉమప్రకాష్
  • కార్వాన్ - అహ్మద్ సఫివుల్ల
  • గోల్కొండ - డి.జగన్
  • మెహిదీపట్నం - టి.దశరథ్
  • మాసబ్ ట్యాంక్ - శోభాశంకర్
  • ఖైరతాబాద్ - బి.శ్రీనివాసులు
  • జూబ్లీహిల్స్ - ఎన్.శంకర్
  • బోరబండ - ఎన్.వాణిశ్రీ
  • యూసుఫ్‌గుడ - శంకర్ సింగ్
  • అమీర్‌పేట్ - ఎ.సుజాత
  • కవాడిగుడ - వి.శ్రీనివాస్ రెడ్డి
  • ముషిరాబాద్ - రామాంజనేయులు రెడ్డి
  • అంబర్‌పేట్ - మారుతీ దివాకర్
  • తార్నాక - ఎంఎన్ఆర్.జ్యోతి
  • మెట్టుగుడ - జి.ఆంజనేయులు
  • నార్సింగి - టి.కృష్ణమోహన్ రెడ్డి
  • పటాన్‌చెరు - ఎ.సురేశ్
  • అమీన్‌పూర్ - ప్రదీప్ కుమార్
  • మియాపూర్ - శశిరేఖ
  • శేరిలింగంపల్లి - వి.ప్రశాంతి
  • మాదాపూర్ - ఎన్.బాలకృష్ణ
  • అల్వీన్ కాలనీ - చాముండేశ్వరి
  • కూకట్‌పల్లి - గంగాధర్
  • మూసాపేట్ - సేవా ఇస్లావత్
  • చింతల్ - లావణ్య
  • జీడిమెట్ల - వి.నర్సింహా
  • కోంపల్లి - ఎన్.కృష్ణారెడ్డి
  • గాజులరామారం - ఎల్పీ.మల్లయ్య
  • నిజాంపేట్ - ఎండీ.సాబేర్ అలీ
  • దుండిగల్ - ఎన్.వెంకటేశ్వర నాయక్
  • మేడ్చల్ - సుదాంష్
Next Story