- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GHMC: జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన.. కొత్త మ్యాప్ ఇదే
హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ లో కొత్త మ్యాప్ ను సభ్యులకు అందజేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఔటర్ రింగు రోడ్డు సరిహద్దుగా జీహెచ్‌ఎంసీని 300 వార్డులకు విస్తరిస్తూ చేపట్టిన డివిజన్ల పునర్విభజన నేపథ్యంలో ప్రభుత్వం కొత్త మ్యాప్‍ను విడుదల చేసింది. ఇవాళ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో డివిజన్ల డీలిమిటేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను అధికారులు సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభ్యులకు డివిజన్ల డీలిమిటేషన్‍తో కూడిన కొత్త మ్యాప్ ను సభ్యులకు అధికారులు అందజేశారు.
వార్డుల డిలిమిటేషన్ గురించి నాకే తెలియదు:
చర్చ సందర్భంగా మేయర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. వార్డుల డీలిమిటేషన్ గురించి తనకే తెలియదని మేయర్ విజయలక్ష్మి చెప్పారు. అంతకు ముందు చర్చ ప్రారంభిస్తూ జీహెచ్ఎంసీ విస్తరణ హైదరాబాద్ కు కొత్త యుగాన్ని సూచిస్తుందని, మరిన్ని ప్రాంతాలను ఏకీకృత పాలన కిందికి తెచ్చి సమాన అభివృద్ధికి బాటలు వేస్తుందని చెప్పారు. చర్చలో సభ్యులు చెప్పిన అభ్యంతరాలను, సలహాలు, సూచనలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.






