- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆధార్ జిరాక్స్ తో వస్తే..ఐదు మొక్కలు ఉచితం
ఆధార్ జిరాక్స్ తీసుకొస్తే ఐదు మొక్కలు ఉచితంగా ఇవ్వనున్నామని మొక్కలు, రెండు ఔషద/అలంకరణ మొక్కలు ఇస్తామని హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ రోహిత్ గోపిడి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం-2026లో భాగంగా ఆధార్ జిరాక్స్ తీసుకొస్తే ఐదు మొక్కలు ఉచితంగా ఇవ్వనున్నామని, మూడు పండ్ల మొక్కలు, రెండు ఔషద/అలంకరణ మొక్కలు ఇస్తామని హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ రోహిత్ గోపిడి తెలిపారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. పచ్చదనాన్ని పెంపొందించడం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం, భూగర్భ జలాలను సంరక్షించడం, జీవవైవిధ్యాన్ని కాపాడడం వంటి లక్ష్యాల సాధనలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రధాన అంశంగా తీసుకుని వనమహోత్సవాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్ వంటి మహానగరంలో వేగవంతమైన జీవనశైలి, పెరుగుతున్న కాలుష్యం, తగ్గుతున్న పచ్చదనం, రసాయన అవశేషాలు ఉన్న ఆహరంపై ఆందోళనలు, జీవనశైలి వ్యాధుల పెరుగుదల వంటి పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడం, పచ్చదనాన్ని కాపాడడం మరియ పర్యావరణాన్ని కాపడాల్సిన ఆవశ్యకత హైదరాబాద్ మహానగరం లో ఎంతైనా ఉందన్నారు. హైదరాబాద్ మెట్రోపోలీటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలోని 44 నర్సరీల నుండి మొక్కలను ఉచితంగా పొందడానికి అవకాశముందని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో జనాభా పెరుగుదల మరియు కొత్త నివాసల అభివృద్ధిని పరిగణలోకి తీసుకుంటే 22 లక్షల కుటుంబాలు నివసిస్తున్నట్లు అంచనా ఉందని, హైదరాబాద్ నగర ప్రజలు ఆరోగ్యావంతమైన జీవనం గడపడానికి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) గణంకాల ప్రకారం ప్రతి రోజు 200 గ్రాముల పండ్లు, 300 గ్రాముల కూరగాయలు ఆహరంలో తీసుకోవాలని తెలిపారు.
‘ప్రతి ఇంటా పండ్లు ప్రతి కుటుంబానికి పోషకాహారం, నగరానికి పచ్చదనం’ ఈ కార్యక్రమంలో భాగంగా హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో తెల్లాపూర్, ఉప్పల్ భగయత్ నర్సరీలలో త్వరలో ఉచిత మొక్కల పంపిణీ మేళా నిర్వహిస్ంచనున్నట్టు రోహిత్ గోపిడి తెలిపారు. ఈ బృహత్ కార్యక్రమం లో హైదరాబాద్ లోని స్వచంద సంస్థలు, రోటరీ, లయన్స్ క్లబ్స్, ఎన్జీఓస్, కాలనీ అసోసియేషన్లు భాగస్వామ్యలు కావాలని కోరారు. మొక్కల కోసం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ చక్రపాణి మొబైల్ నెం. 8374449345, ఫారెస్ట్ మేనేజర్లు వంశీ కృష్ణ 9849052634, ప్రణీత్ కౌర్ 9618501983, దీపిక 9441366136, సత్యనారాయణమ్మ 6309029925, నిఖిల్ 9985157768లను సంప్రదించాలని కోరారు. ఈ నగరంలోని నివాసలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు ఒక ఉద్యమంలా తీసుకొని ఈ నగరాన్ని, హరిత నగరంలా మరియు ఆరోగ్యవంతమైన మహానగరంలా తీర్చిదిద్దాలని డైరెక్టర్ రోహిత్ గోపిడి కోరారు.






