GBS Alert: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. నగరంలో ఫస్ట్ గులియన్ బారే సిండ్రోమ్‌ కేసు నమోదు

by Kema Shiva Kumar |

ప్రమాదకరమైన గులియన్ బారే సిండ్రోమ్ (Guillain Barre Syndrome) వ్యాధి దేశ వ్యాప్తంగా చాపకింద నీరులా వ్యాపిస్తోంది

GBS Alert: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. నగరంలో ఫస్ట్ గులియన్ బారే సిండ్రోమ్‌ కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రమాదకరమైన గులియన్ బారే సిండ్రోమ్ (Guillain Barre Syndrome) వ్యాధి దేశ వ్యాప్తంగా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఎవరి కంట పడకుండానే మెల్లిమెల్లిగా అందరికీ సోకుతూ చాలామంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఈ క్రమంలోనే హైరదాబాద్ (Hyderabad) నగరంలో గులియన్ బారే సిండ్రోమ్ (Guillain Barre Syndrome) కేసు నమోదైంది. సిద్ధిపేట (Siddipet) మండల కేంద్రానికి చెందిన మహిళఖు పరీక్షలు చేసి వైద్యులు గిలియన్ బారే సిండ్రోమ్ (Guillain Barre Syndrome) ఉన్నట్లుగా నిర్ధారించారు. ప్రస్తుతం ఆ బాధితురాలు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్ల పర్యేవక్షణలో చికిత్స పొందుతోంది. ఇప్పటికే పొరుగు రాష్ట్రంలో మహారాష్ట్ర (Maharashtra)లో వందకు పైగా గిలియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

నాలుగు రోజుల్లో ముగ్గురు మృతి పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలో గులియన్ బారే సిండ్రోమ్ కలకలం సృష్టిస్తోంది. దీంతో గత నాలుగు రోజుల్లో ఒక చిన్నారితో పాటు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కోల్‌‌కతా (Kolkata), హుగ్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ మరణాలు సంభవించాయి. కోల్‌కతాలోని బీసీ రాయ్ (BC Roy) ఆసుపత్రిలో ఈ నెల 26న దెబ్ కుమార్ సాహూ (10) అనే బాలుడు మృతి చెందాడు. ఆ మరుసటి రోజే నగరంలోని ఎస్ఆర్ఎస్ మెడికల్ కాలేజీలో అరిత్ర మనల్ (17), హుగ్లీ జిల్లాలోని మరో ఆసుపత్రిలో 48 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్లుగా అధికారిక వర్గాలు ధృవీకరించాయి.

మరోవైపు మమారాష్ట్రలోని పుణెలో ఇప్పటి వరకు 127 గులియన్ బారే సిండ్రోమ్ అనుమానాస్పద కేసులు నమోదు అయినట్లుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, రాష్ట్రంలో ఎవరైనా గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలతో బాధపడినా వెంటనే ఆస్పత్రులకు వెళ్లి రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధి సోకినా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని.. కాకపోతే వెంటనే ఆసుపత్రిలో చేరితే చికిత్సతో త్వరగా కోలుకోవచ్చని పేర్కొంటున్నారు.

వ్యాధి లక్షణాలు ఇవే..

గులియన్-బారే సిండ్రోమ్ (GBS) అనేది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. కండరాల బలహీనత లేదా పక్షవాతం వంటి లక్షణాలు ఉంటాయి. ఇది బలహీనత, పక్షవాతం లేదా నొప్పిని కలిగిస్తుంది. బాధితులకు ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్స్ (IVIG) ఇంజెక్షన్లు లేదా ప్లాస్మా మార్పిడితో చికిత్స అందిస్తారు.గులియన్-బారే సిండ్రోమ్ (GBS) అనేది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. కండరాల బలహీనత లేదా పక్షవాతం వంటి లక్షణాలు ఉంటాయి. ఇది బలహీనత, పక్షవాతం లేదా నొప్పిని కలిగిస్తుంది. బాధితులకు ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్స్ (IVIG) ఇంజెక్షన్లు లేదా ప్లాస్మా మార్పిడితో చికిత్స అందిస్తారు.


Next Story