Qqsuda: క్యూక్యూఎస్యూడీఏ అడ్మినిస్ట్రేటర్ గా గౌతమి బాధ్యతలు

by velandi.Saikiran |

QQSUDA అడ్మినిస్ట్రేటర్ గా పి.గౌతమిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Qqsuda: క్యూక్యూఎస్యూడీఏ అడ్మినిస్ట్రేటర్ గా గౌతమి బాధ్యతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కులీకుతూబ్ షా అర్బన్ డవలప్ మెంట్ ఆథారిటీ(క్యూక్యూఎస్యూడీఏ) అడ్మినిస్ట్రేటర్ గా పి.గౌతమిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇంతకుముందున్న అడ్మినిస్ట్రేటర్ గా పనిచేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ.కర్ణన్ ను ప్రభుత్వం రిలీవ్ చేసింది. అయితే మూసీ రివర్ డవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్(జేఎండీ)గా పనిచేస్తున్న పి.గౌతమి క్యూక్యూఎస్యూడీఏ నూతన అడ్మినిస్ట్రేటర్ గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రమాదేవి, సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ)గోపాల్, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్(ఈఈ) వహాజుద్దీన్, ఉద్యోగులు పాల్గొన్నారు.

Next Story