TGHRC: పాఠశాల సమీపంలో గ్యాస్ గోదాం తొలగించాల్సిందే.. టీజీహెచ్ ఆర్సీ ఆదేశం

by Prasad Jukanti |   (  Updated:2025-07-30 12:47:33  IST  )

పాఠశాల, నివాస ప్రాంతాలకు అత్యంత సమీపంగా నిర్వహిస్తున్న గ్యాస్ గోదాం విషయంలో మానవ హక్కుల కమిషన్ సంచలన ఆదేశాలు ఇచ్చింది.

TGHRC: పాఠశాల సమీపంలో గ్యాస్ గోదాం తొలగించాల్సిందే.. టీజీహెచ్ ఆర్సీ ఆదేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాల, నివాస ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉన్న గ్యాస్ గోదాం విషయంలో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) కీలక ఆదేశాలు ఇచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో హెచ్ పీ గ్యాస్ గోదాం ప్రభుత్వ పాఠశాల, నివాస ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉందని దీని వల్ల అనుకోకుండా ఏదైనా సంభవిస్తే ప్రాణనష్టం జరుగుతుందని అందువల్ల దీనిపై చర్యలు తీసుకోవాలని టీఎస్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ సదరు గోదాంను అక్కడి నుంచి తరలించాలని ఆదేశించారు. పాఠశాలలు, నివాస ప్రాంతాల మధ్య ఇటువంటి ప్రమాదకర గోదాముల నిర్వహణ ప్రజల జీవించే హక్కును (ఆర్టికల్ 21) ఉల్లంఘించడమేనని కమిషన్ పేర్కొంది. ఇలాంటి ప్రాంతాల్లో ప్రమాదకర పదార్థాల నిల్వ ప్రజల ప్రాణభద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. రెండు నెలల లోపు సంబంధిత అధికారుల ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కలెక్టర్‌ను కమిషన్ ఆదేశించింది.

Next Story