గ్యాస్ బుకింగ్‌‌తో వచ్చిన తిప్పలు.. ఫోన్ చేస్తే ‘ప్రాసెసింగ్’ మెసేజ్‌లు

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-16 04:41:42  IST  )

గ్యాస్ బుకింగ్‌ సమస్యలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫోన్ చేస్తే 24 గంటల్లో ప్రాసెస్ చేస్తామంటూ ఏజెన్సీల నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి.

గ్యాస్ బుకింగ్‌‌తో వచ్చిన తిప్పలు.. ఫోన్ చేస్తే ‘ప్రాసెసింగ్’ మెసేజ్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: మహానగరంలో వినియోగదారులకు గ్యాస్ బుకింగ్ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో సదరు ఆయిల్ కంపెనీల ఐవీఆర్ఎస్‌ (IVRS)కు ఫోన్ కాల్ చేయగానే బుకింగ్ నంబర్ వచ్చేది, కానీ ఇప్పుడు కాల్ చేసినా కేవలం ‘ప్రాసెసింగ్’ మెసేజ్‌లతోనే సరిపెడుతున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా గ్యాస్ బుకింగ్ (Gas Booking) కోసం అధికారిక నంబర్‌కు కాల్ చేసినప్పుడు, వెంటనే బుకింగ్ కన్ఫర్మేషన్ రావాలి. అయితే, ప్రస్తుతం చాలా మంది వినియోగదారులకు ‘మీ అభ్యర్థన అందింది, 24 గంటల్లో ప్రాసెస్ చేస్తాం’ అనే మెసేజ్‌లు మాత్రమే వస్తున్నాయి. తీరా 24 గంటలు గడిచినా బుకింగ్ నంబర్ రాకపోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

ఏజెన్సీల నిర్లక్ష్యపు సమాధానం..

ఈ సమస్యపై ఫిర్యాదు చేసేందుకు గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలకు వెళ్తే.. అక్కడి సిబ్బంది బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ‘నేరుగా ఇక్కడ బుకింగ్ తీసుకోం.. మీరు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలి’ అని వినియోగదారులను వెనక్కి పంపుతున్నారు. దీంతో పట్టణ ప్రజలకు బుకింగ్ సమస్యలతో అల్లాడుతున్నారు. ఇక స్మార్ట్ ఫోన్లు వాడటం తెలియని వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

బుకింగ్‌కు ఆల్టర్‌నేట్ మార్గాలివే..

గ్యాస్ బుకింగ్ కోసం ఏజెన్సీలకు వెళితే.. అక్కడి సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాల్లో గ్యాస్ బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ మీకు ఫోన్ కాల్ ద్వారా బుకింగ్ అవ్వకపోతే ఇండేన్ గ్యాస్ కనెక్షన్ అయితే,, వాట్సాప్ ద్వారా 75888 88824 నంబర్‌కు రిజిస్టర్డ్ మొబైల్ నుంచి ‘REFILL’ అని మెసేజ్ పంపాలని పేర్కొన్నారు. అదేవిధంగా మొబైల్‌లో ఇండియన్ ఆయిల్ వన్ (IndianOil One), హెచ్‌పీ (HP Pay) యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని గ్యాస్‌ను నేరుగా బుక్ చేసుకోవచ్చని తెలిపారు.

Next Story