- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Banakacherla: కేటీఆర్, హరీశ్ రావు మధ్య గ్యాప్.. ఏపీ మంత్రి హాట్ కామెంట్స్
కేటీఆర్, హరీశ్ రావు మధ్య రాజకీయ అస్తిత్వ పోరు నడుస్తోందని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉనికి కోసమే బనకచర్ల (Banakacharla) అంశాన్ని బీఆర్ఎస్ తెరపైకి తీసుకువచ్చిందని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) విమర్శించారు. కేటీఆర్, హరీశ్ రావు మధ్య రాజకీయ అస్తిత్వ పోరు నడుస్తోందని గులాబీ పార్టీలో నెలకొన్న అంత్రగత వివాదంతో ఆ పార్టీ నేత హరీశ్ రావు తన ఉనికిని కాపాడుకునేందుకు ఈ ప్రాజెక్టును రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో తిరుపతికి వచ్చినప్పుడు రాయలసీమకు గోదావరి నీళ్లు ఇస్తామని కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు. హరీశ్ రావు ట్రాప్ లో పడి మిగతా వాళ్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశంపై ఎక్కడా మాట్లాడటం లేదని ఇదంతా ఓ డ్రామా అని కొట్టిపారేశారు. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకుఎలాంటి నష్టం ఉండదని సముద్రంలో కలిసే నీళ్లను వాడుకుంటే తెలంగాణకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.






