Ganja: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో గంజాయి కలకలం

by Ramesh Goud |

సంక్రాంతి పండుగ వేళ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station) లో గంజాయి తరలిస్తుండటం కలకలం రేపింది.

Ganja: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో గంజాయి కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి పండుగ వేళ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station) లో గంజాయి తరలిస్తుండటం కలకలం రేపింది. గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్లో గంజాయి తరలిస్తున్నారని ముందస్తు సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు(Railway Police) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సోదాలలో గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి లక్షా 50 వేల విలువ చేసే ఆరు కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఒడిశా(Odisha) రాష్ట్రం బరంపూర్(Barampur) నుంచి మహారాష్ట్ర(Maharastra)కు గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దీని వెనుక ఎవరైనా ఉన్నారా? లేక ఒక్కడే చేశాడా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు.

Next Story