- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: సాయంత్రం రిటైర్మెంట్.. మధ్యాహ్నం పోస్టింగ్
కరీంనగర్ నీటిపారుదల శాఖ(Karimnagar Irrigation Department) ఈఎన్‌సీగా జి.అనిల్‌కుమార్ నియమితులయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ నీటిపారుదల శాఖ(Karimnagar Irrigation Department) ఈఎన్‌సీగా జి.అనిల్‌కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న అనిల్‌కుమార్‌కు తాజాగా పోస్టింగ్ ఇచ్చారు. అయితే.. ఇవాళే పదవీ విరమణ చేయనున్న అనిల్‌కుమార్ బాధ్యతలు అప్పగించడం హాట్ టాపిక్‌గా మారింది.
కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ముద్ర పడ్డ, ఏసీబీకి చిక్కిన పలువురు అధికారుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించారనే కారణంగా ప్రభుత్వం అనిల్‌కుమార్‌ను గత రెండు నెలల నుంచి పోస్టింగ్ ఇవ్వకుండా వెయింటింగ్‌లో ఉంచింది. ఆయన ప్రస్తుతం ఎలాంటి విధులు నిర్వర్తించడం లేదు. కాగా శుక్రవారం అనిల్‌కుమార్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కరీంనగర్ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీగా అనిల్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనకు పెన్షన్‌తో పాటు వెయింట్ కాలానికి జీతం కూడా వచ్చే అవకాశం ఉందని ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు.






