కల్తీకల్లుకు మరొకరు బలి.. గాంధీలో చికిత్స పొందుతున్న వృద్ధుడు మృతి

by Bhanu |   (  Updated:2025-07-11 03:05:16  IST  )

కల్తీకల్లు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

కల్తీకల్లుకు మరొకరు బలి.. గాంధీలో చికిత్స పొందుతున్న వృద్ధుడు మృతి
X

దిశ, శేరిలింగంపల్లి: కల్తీకల్లు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఏడుగురు మృతి చెందగా పలువురు ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కల్తీకల్లు సేవించి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆదర్శ నగర్ ఇంద్రాహిల్స్ కాలనీకి చెందిన చాకలి పెద్ద గంగరాం (70) చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కల్తీకల్లు బాధితులకు చికిత్స కొనసాగుతుంది. గంగారం మరణంతో కల్తీకల్లు మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.

Next Story