JNAFAU In-charge Vice Chancellor : జేఎన్ఏఎఫ్ఏయు ఇంచార్జి వైస్ చాన్సలర్ గా గంగాధర్‌ నియామకం

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2024-12-07 12:08:24  IST  )

జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (JNAFAU)ఇంచార్జి వైస్ ఛాన్సలర్‌(In-charge Vice Chancellor)గా ప్రొఫెసర్ తోపారపు గంగాధర్‌(Toparapu Gangadhar)ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది

JNAFAU In-charge Vice Chancellor : జేఎన్ఏఎఫ్ఏయు ఇంచార్జి వైస్ చాన్సలర్ గా గంగాధర్‌ నియామకం
X

దిశ, వెబ్ డెస్క్ : జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (JNAFAU) ఇంచార్జి వైస్ ఛాన్సలర్‌(In-charge Vice Chancellor)గా ప్రొఫెసర్ తోపారపు గంగాధర్‌(Toparapu Gangadhar)ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సచివాలయంలో ప్రతిష్టంచనున్న తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రొఫెసర్ తోపారపు గంగాధర్‌ రూపకర్త కావడం ఈ సందర్భంగా గమనార్హం.

సచివాలయంలో ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరుగనుంది. ఇంతలోనే గంగాధర్‌ ను ప్రభుత్వం జేఎన్ఏఎఫ్ఏయు ఇంచార్జి వైస్ చాన్సలర్ గా నియమించి గౌరవించడం విశేషం.

Next Story