- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మ్యాంగో జ్యూస్ తాగుతున్నారా.. వెంటనే ఇది తెలుసుకోండి!
by GSrikanth |
కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో పాటు లిటిల్ ఛాంప్స్ పేరుతో మ్యాంగో డ్రింక్ తయారు చేస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు.

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో పాటు లిటిల్ ఛాంప్స్ పేరుతో మ్యాంగో డ్రింక్ తయారు చేస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. కాటేదాన్ పారిశ్రామికవాడలోని ఓ కంపెనీలో కొన్నేళ్లుగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడుగా నడుస్తున్నట్టు అందిన సమాచారం మేరకు దాడులు జరిపారు. తనిఖీలో కుళ్లిపోయిన అల్లం వెల్లుల్లితో పేస్ట్ తయారు చేస్తున్నట్టు వెళ్లడయ్యింది. ఘాటు కోసం ఆసిటిక్ యాసిడ్ తోపాటు ఇతర రసాయనాలు కలుపుతున్నట్టు తేలింది. ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేనట్టు స్పష్టం అయ్యింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు 500 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యాంగో డ్రింక్, 210 లీటర్ల ఆసిటిక్ యాసిడ్, 550 కిలోల నాన్ వెజ్ మసాలా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
Next Story






