భూపాలపల్లి గొడవకు గండ్రనే కారణం! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |

నిన్నటి కాంగ్రెస్ సభలో బీఆర్ఎస్ శ్రేణుల దాడి ఘటనపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.

భూపాలపల్లి గొడవకు గండ్రనే కారణం! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిన్నటి కాంగ్రెస్ సభలో బీఆర్ఎస్ శ్రేణుల దాడి ఘటనపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ నేతలు దాడి చేశారని, భూపాలపల్లిలో గొడవకు గండ్ర వెంకటరమణారెడ్డినే కారణం అని ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. గండ్రపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. గండ్ర విచారణకు సిద్ధంగా ఉండాలన్నారు.

ఈ దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ నేతలకు పోలీసులు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. కాగా హాథ్ సే హాథ్ జోడో యాత్ర సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న సభ ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సభలో రేవంత్ మాట్లాడుతుండగా వాహనంపై ఒక్కసారిగా దాడి జరిగింది. బీఆర్ఎస్ శ్రేణులు రాళ్లు, చెప్పులు, కోడిగుడ్లు విసరడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు ఘర్ణణకు దిగాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Next Story