- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gandra: రాజలింగమూర్తి హత్యపై గండ్రా వెంకటరమణారెడ్డి ఫస్ట్ రియాక్షన్
రాజలింగమూర్తి హత్యపై మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి స్పందించారు.

దిశ,తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాజలింగమూర్తి హత్యపై (Rajalingamurthy murder) భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి (Gandra Venkataramana Reddy) స్పందించారు. ఈ హత్యతో బీఆర్ఎస్ (BRS) పార్టీకి, నాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. నిన్న భూపాలపల్లిలో జరిగిన రాజలింగమూర్తి హత్యను ఖండించారు. ఈ హత్య విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాపైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని హత్యను ప్రభావితం చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. హత్య జరిగిన తర్వాత రాజలింగమూర్తి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. హత్య నెపం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, హరీష్ రావుతో పాటు నాపైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాజలింగమూర్తి హత్యకు భూవివాదాలు కారణం అని తెలుస్తోందని కొంతమంది వ్యక్తులు ప్రేరేపించి రాజలింగమూర్తి భార్యతో మాట్లాడించారన్నారు. ఈ హత్య పై సీఐడీ విచారణ కాదు సీబిఐ విచారణ చేసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. రాజలింగమూర్తి వేసిన కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతుందన్నారు.






