- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాంధీ మెడికల్ కాలేజీ విద్యార్థిని మృతి.. రెండు సార్లు ఆపరేషన్ చేసినా..
గాంధీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని వైద్య విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గాంధీ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గాంధీ ఆసుపత్రిలో మెడికల్ విద్యార్థిని మృతి చెందింది. గాంధీ మెడికల్ కాలేజీలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్న పల్లవి గౌడ్ ఈ నెల 16వ తేదీన ఛాతికి సంబంధించిన సమస్యతో అదే ఆసుపత్రిలో చేరింది. అయితే పల్లవికి వైద్యం చేసిన డాక్టర్లు ఈ నెల ఈనెల 17న సర్జరీ చేసి కణితి తొలగించారు. ఈ ఆపరేషన్ విఫలం కావడంతో ఈ నెల 20వ తేదీన ఆమెకు రెండో సారు కూడా సర్జరీ నిర్వహించారు. రెండోసారి ఆపరేషన్లు నిర్వహించిన వైద్యులు తీరా పల్లవి మరణించినట్లు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే పల్లవి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం అని, అనుభవం లేని వైద్యులు అందించిన చికిత్స వల్లే వైధ్యం వికటించి తమ కూతురు మృతి చెందిందని పల్లవి మృతి చెందిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పల్లవి తల్లిదండ్రులు చిలకలగూడ పోలీస్ స్టేషన్‍లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేసే వరకు మృతదేహాన్ని తీసుకువెళ్లేద లేదని పల్లవి తల్లిదండ్రులు, ఆమె బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






